బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈవారం ఏడుగురు కంటెస్టెంట్లు రాజ్, ఫైమా, రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ అత్యధిక ఓట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. రోహిత్‌కు స్క్రీన్ స్పేస్ తగ్గించడంతో అతడిని ఎలిమినేట్ చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ లాస్ట్ డే అతడికి భారీగా ఓట్లు పడి సేవ్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిందల్లా శ్రీసత్య, రాజ్, ఫైమా.. ఎలాగో ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. కాబట్టి తను డేంజర్ జోన్‌లో ఉంటే తనకోసమే వాడుకుంటుంది.
ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్ చేసేస్తే మాత్రం చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్ వాడే ఆస్కారం ఉంది. అంటే ఈవారం ఎలిమినేషన్ ఫైమా చేతిలో ఉందన్నమాట! ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తనకోసం వాడుకుంటుందా? రాజ్, శ్రీసత్యలలో ఎవరికైనా ఉపయోగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రాజ్‌ను ఎలిమినేట్ చేసేందుకు బిగ్‌బాస్ టీమ్ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: కెప్టెన్‌గా ఇనయ కొత్త రూల్, ఫైమాకు మట్టి తినే అలవాటు
ఆమెకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుందనుకున్నా: హమీదా
Comments
Please login to add a commentAdd a comment