ప్రణమ్య
నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా!
Published Mon, Feb 17 2014 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
అనూప్‌తేజ్, యశ్వంత్, ప్రణమ్య ముఖ్యతారలుగా రాజశేఖర్ ఎ.ఎం. దర్శకత్వంలో టి.విజయవాసుదేవరెడ్డి నిర్మించిన ‘నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ‘అల్లరి’ నరేష్ ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘు మాస్టర్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేష్ మాట్లాడుతూ -‘‘టైటిల్ అందరికీ నచ్చేలా ఉంది. సినిమా కూడా అదే రీతిలో ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటున్నా’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్ అందరికీ నచ్చేలా ఉంది. సినిమా కూడా అదే రీతిలో ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటున్నా’’ అన్నారు. లవ్, రొమాన్స్ యాక్షన్, ఫిక్షన్, థ్రిల్లర్ అన్నీ ఉన్న సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు’’ అని చెప్పారు. అనూప్‌తేజ్ మాట్లాడుతూ -‘‘నా తొలి సినిమా ‘కేక’. ఇది నాకు మంచి బ్రేక్ ఇస్తుంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల విశ్వనాథ్, సుభాష్ నారాయణ్, జీవన్ కిషోర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.
Advertisement
Advertisement