యాగ్రీ మ్యాన్, హీరో రాజశేఖర్, జీవితల తనయగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు ప్రస్తుతం వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ, బ్రహ్మనందం, కలర్స్ స్వాతి పంచతంత్రం చిత్రాల్లో నటిస్తుంది.
ఇవేకాక శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. గతేడాది ‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
గౌతమ్ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. ఇదిలా ఉంటే హీరోయిన్‌గా బిజీ ఉంటునే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పొగొడుతోంది ఈ యంగ్ హీరోయిన్. ఈనేపథ్యంలో తాజాగా చూడిదారుతో దిగిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ఎల్లో కలర్ చుడిదార్‌లో క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ శివాత్మిక మరోసారి కుర్రకారు కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment