Bigg Boss 6 Telugu: BB Cuts Prize Money of Winner - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ప్రైజ్‌మనీకి గురి పెట్టిన బిగ్‌బాస్‌, ఎన్ని లక్షలు తగ్గాయంటే?

Published Tue, Nov 15 2022 6:04 PM | Last Updated on Tue, Nov 15 2022 6:46 PM

Bigg Boss 6 Telugu: BB Cuts Prize Money of Winner - Sakshi

బిగ్‌బాస్‌ షో మొదలై పదివారాలు పూర్తయినా నామినేషన్స్‌ మాత్రం ఇంకా చప్పగానే సాగుతున్నాయి. నిన్నటి నామినేషన్స్‌ చెత్తగా ఉన్నాయని సోషల్‌ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే నామినేషన్స్‌ నుంచి కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఒక చెక్‌ ఇచ్చి దాని మీద యునిక్‌గా అనిపించే అమౌంట్‌ రాయమన్నాడు. ఏ సభ్యులైతే చెక్‌పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్‌ నుంచి సేవ్‌ అవుతారని చెప్పాడు. అయితే ఈ మొత్తం బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీలో నుంచి తగ్గిస్తామని ట్విస్ట్‌ ఇచ్చాడు.

చెక్‌పై ఎంత రాస్తున్నామన్నది ఎవరితో చర్చించడానికి వీల్లేదని బిగ్‌బాస్‌ మరీమరీ చెప్పాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో శ్రీసత్య ఈ పోటీలో అనర్హురాలిగా నిలిచింది. ఇక సేవ్‌ అవడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు రాస్తే మాత్రం వారికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదన్నాడు ఆదిరెడ్డి. 

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎవరెంత అమౌంట్‌ రాశారంటే...
ఆదిరెడ్డి - లక్ష రూపాయలు
శ్రీహాన్‌ - లక్ష రూపాయలు
రోహిత్‌ - రూ. 2.51,001
రాజ్‌ - రూ.4,99,700
మెరీనా - రూ.4,99,998
ఇనయ - రూ.4,99,998
కీర్తి - రూ. 4,99,999
రేవంత్‌ - రూ.4,99,999
సత్య - రూ.4,99,999 లక్షలు రాశారు.

అదేంటో గానీ అత్యధిక నంబర్‌ రాసినవారు కాకుండా రాజ్‌ను సేవ్‌ చేశాడట బిగ్‌బాస్‌. అంతేకాదు, ప్రైజ్‌ మనీలో నుంచి రూ. 5 లక్షలు కట్‌ అయ్యాయట. ఇదేం ట్విస్ట్‌ అనుకుంటున్నారా? మరి అదెలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ కోసం వేచి చూడాల్సిందే!

చదవండి: చెత్త రీజన్స్‌, చెత్త నామినేషన్స్‌.. కాకపోతే ఓ ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement