ప్రతిసారి నేనే బాధితుడిగా మారాల్సి వస్తోంది: రేవంత్‌ | Bigg Boss Telugu 6: Housemates Engage in Intense Arguments During Nomination | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఇనయ బూతులు మాట్లాడుతోందన్న శ్రీసత్య

Published Mon, Nov 14 2022 6:43 PM | Last Updated on Mon, Nov 14 2022 6:51 PM

Bigg Boss Telugu 6: Housemates Engage in Intense Arguments During Nomination - Sakshi

ఆవేశంలో బూతు మాటలు అనేస్తున్నావని ఇనయను నామినేట్‌ చేసింది శ్రీసత్య. ఎవరి వల్ల కెప్టెన్సీ గేమ్‌ ఓడిపోయాడో ఆ ఇద్దరినే(రేవంత్‌, ఆది రెడ్డిని) నామినేట్‌ చేశాడు

నామినేషన్స్‌ వచ్చాయంటే చాలు ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ప్రవర్తిస్తారు హౌస్‌మేట్స్‌. ఎక్కడెక్కడినుంచో ఏవేవో కారణాలు వెతికి పట్టుకుని మరీ ఒకరినొకరు నామినేట్‌ చేసుకుంటారు. ఈ క్రమంలో మాటల యుద్ధాలు కూడా జరుగుతాయి. కానీ నామినేషన్‌ ప్రక్రియ ముగియగానే అందరూ తిరిగి మామూలవడమే ఒక మ్యాజిక్‌గా అనిపిస్తుంది.

ఇదంతా పక్కనపెడితే తాజాగా నామినేషన్స్‌కు సంబంధించి మరో ప్రోమో రిలీజైంది. ఇందులో రాజ్‌.. వాసంతి నా గురించి మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, నీకెందుకు? అని ఇనయను నిలదీశాడు. దీనికామె.. తనకేదనిపిస్తే అది చెప్పేస్తానంది. అంటే నువ్వు ఏం సోది చెప్పినా మేమందరం కూర్చుని వినాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆవేశంలో బూతు మాటలు అనేస్తున్నావని ఇనయను నామినేట్‌ చేసింది శ్రీసత్య. ఎవరి వల్ల కెప్టెన్సీ గేమ్‌ ఓడిపోయాడో ఆ ఇద్దరినే(రేవంత్‌, ఆది రెడ్డిని) నామినేట్‌ చేశాడు రోహిత్‌. సంచాలక్‌గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నావంటూ రేవంత్‌ను నామినేట్‌ చేసింది మెరీనా. ఇక రేవంత్‌ వంతు రాగా.. ఈ హౌస్‌లో ప్రతి చిన్న పాయింట్‌ పట్టుకుని నామినేట్‌ చేస్తున్నారు. అలా చిన్నపాటి విషయాలకు కూడా నామినేట్‌ చేసిన సందర్భాల్లో 70% నేనే బాధితుడిని అవుతున్నా అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అందంలో బుట్టబొమ్మ ఆటలో ఉ‍త్త బొమ్మ.. పరువు తీసిన యాంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement