Bigg Boss 6 Telugu: Sri Satya Going to Eliminate Mid Week - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ కానున్న శ్రీసత్య

Published Thu, Dec 15 2022 3:40 PM | Last Updated on Fri, Dec 16 2022 10:30 PM

Bigg Boss 6 Telugu: Sri Satya Going to Eliminate Mid Week - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. 21 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. కానీ ఫినాలేకు ఐదుగురు మాత్రమే వెళ్తారని ప్రకటించాడు నాగ్‌. అంటే ఎన్నడూ లేనిది ఈసారి కొత్తగా మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ చేపట్టనున్నారు.  నిన్నటివరకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని అతి తక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని నేడు ఎలిమినేట్‌ చేస్తారన్నమాట.

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీసత్యను మిడ్‌వీక్‌ ఎలిమినేషన్‌తో హౌస్‌ నుంచి బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. కానీ హాట్‌స్టార్‌లో ఆమెకు ఓటింగ్‌ వేసేందుకు ఇంకా ఛాన్స్‌ ఉన్నట్లు చూపిస్తోంది. బహుశా ఓటింగ్‌ లిస్ట్‌ నుంచి ఆమెను తప్పిస్తే ఎలిమినేట్‌ అయింది ఎవరనేది ముందే తెలిసిపోతుందని బిగ్‌బాస్‌ తనను ఇంకా ఓటింగ్‌ లైన్‌లో ఉంచినట్లు కనిపిస్తోంది. కానీ దీనివల్ల మిగతా ఐదుగురికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తనను ఓటింగ్‌ లిస్ట్‌లో ఉంచడం వల్ల శ్రీసత్యకు ఓట్లేసినా అవి బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క! అదే ఓటింగ్‌ లైన్‌ క్లోజ్‌ చేస్తే ప్రేక్షకులు తనకు కాకుండా మిగతా ఐదుగురిలో వారికి నచ్చినవారికి ఓట్లేసి గెలిపించుకునే ఆస్కారం ఉంది.

మరోవైపు మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ఉందన్న విషయం టాప్‌ 6 కంటెస్టెంట్లకు ఇంతవరకు తెలియదు. గ్రాండ్‌ ఫినాలేకు ఎలా రెడీ అవాలి? సూట్‌ కేస్‌ ఆఫర్‌ చేస్తే ఏం చేయాలి? ఇలా దాని గురించే ఆలోచిస్తూ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. డబ్బుల కోసమే బిగ్‌బాస్‌కు వచ్చానన్న శ్రీసత్య సూట్‌కేస్‌ ఆఫర్‌ చేస్తే తీసుకుపోయేందుకు కూడా సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో ఆమెను ఫినాలేకు రెండు రోజుల ముందే బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి.

చదవండి: నన్ను బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement