యూరోప్‌ వీధుల్లో శ్రీసత్య, మోహబూబ్‌.. అదిరిపోయిన రొమాంటిక్‌ సాంగ్‌! | Mehaboob Dilse, Sri Satya Nuvve Kavali Music Video Song Out | Sakshi
Sakshi News home page

యూరోప్‌ వీధుల్లో బిగ్‌బాస్‌ ఫేం మెహబూబ్, శ్రీసత్య రొమాంటిక్‌ సాంగ్‌!

Published Sat, Jan 25 2025 12:18 PM | Last Updated on Sat, Jan 25 2025 12:22 PM

Mehaboob Dilse, Sri Satya Nuvve Kavali Music Video Song Out

బిగ్‌బాస్‌ ఫేం మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య జంటగా ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ చేశారు. ఈ రొమాంటిక్‌ సాంగ్‌కి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానే అయ్యి  చిత్రీకరించారు. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో అందంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ మరియు ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు మరియు క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు.

శ్రీ సత్య మాట్లాడుతూ : ఈ సాంగ్ రిలీజ్ కోసం అప్పటినుంచి ఎదురు చూస్తున్నాను. ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఫ్రెండ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది. మెహబూబ్ తో కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ కి నన్ను తీసుకున్నందుకు భార్గవ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసే పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మహబూబ్ మాట్లాడుతూ : నాకోసం టైం కేటాయించి అడగగానే వచ్చిన నా ఫ్రెండ్స్ సోహెల్, నోయల్, విక్కీ, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, ప్రియాంక ఇలా విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని ప్రశంసిస్తున్నారు. అడగగానే ఈవెంట్ ని హోస్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన స్రవంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈవెంట్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఈ స్వామిని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. అదేవిధంగా భార్గవ్ తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో కల్లా ఇది కచ్చితంగా బెస్ట్ గా నిలబడుతుంది. అద్భుతమైన లొకేషన్స్ లో చాలా బాగా ఈ సాంగ్ ని చిత్రీకరించారు. మహబూబ్ టిక్ టాక్ మొదలుపెట్టి యూట్యూబ్ వరకు ఎన్నో వీడియోస్, సాంగ్స్ కష్టపడి చేసి ఈ స్థాయికి వచ్చాడు. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ మరియు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను అన్నారు.

సోహెల్ మాట్లాడుతూ : మహబూబ్ నా దోస్త్. ఈ సాంగ్ ని చాలా కష్టపడి చేశాడు. శ్రీ సత్య, మెహబూబ్ పెయిర్ చాలా బాగుంది. భార్గవ్ పిచ్చరైజేషన్, డైరెక్షన్, ఎడిటింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. మనీష్ అందించడం మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్ లిరిక్స్ లో మంచి ఫీల్ ఉంది. అందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సిరి హనుమంత్ మాట్లాడుతూ : మెహబూబ్ ది ముందు నుంచి కష్టపడే తత్వం. ఖాళీ దొరికితే ఏ వీడియో సాంగ్ చేయాలనే ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీ సత్య, మెహబూబ్ కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్ ని నాకు ముందే చూపించారు మంచి లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సాంగ్ తో మెహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి మంచి మంచి పేరు తీసుకురావాలని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


ప్రియాంక జైన్ మాట్లాడుతూ : సాంగ్ చాలా బాగా ఉంది. ఈ సాంగ్ రిలీజ్ కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా. ఇవాళ ఈ సాంగ్ ఇంత గ్రాండ్ గా లంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు ఈ సాంగ్ తీయడానికి ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. ప్రతి ప్రేమ చాలా ఫ్రెష్ గా అందంగా ఉంది. ఈ సాంగ్ ని నేను శివ తో రీ క్రియేట్ చేస్తాను. మహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి ఈ సాంగ్ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కిరాక్ సీత మాట్లాడుతూ : నాకు ఈ సాంగ్ ముందే చూపించారు. అప్పుడే నాకు అర్థమైంది సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుందని. ఒక సాంగ్ కోసం బయట దేశం వెళ్లారు అంటే వర్క్ పైన వాళ్లకు ఉన్న డెడికేషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సాంగ్ ని అందరూ సపోర్ట్ చేసి ఏ టీం కి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement