Private Albums
-
‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’.. భీమ్స్ సాంగ్ అదిరింది
ఈ మధ్య కాలంలో తెలంగాణ జానపద గీతాలకు చిత్ర పరిశ్రమలో మంచి స్పందల లభిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో సైతం ఫోక్ సాంగ్స్ ఉంటున్నాయి. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్గాను ఈ పాటలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నివృతి వైబ్స్ సంస్థ అత్యుత్తమమైన ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఆడియో, విజువల్ కంటెంట్‌తో ఫోక్ సాంగ్స్‌ని చిత్రీకరించి యూట్యూబ్‌లో రిలీజ్ చేసి హిట్ కొట్టేస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ విడుదల చేసిన జరీ జరీ పంచెకట్టి.., గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి వంటి పాటలకు ఆడియన్స్‌ని నుంచి మంచి స్పందల లభించిన చింది. (చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? ) తాజాగా ఈ సంస్థ మరో తెలంగాణ జానపద గీతాన్ని మ్యూజిక్ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..నాకేందిర ఈ లొల్లి’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. (చదవండి: వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక ) బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్, ఇమేజ్ను దక్కించుకున్న జయతి ఈ సాంగ్‌లో అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు సాంగ్ కు సంగీత సారథ్యాన్ని వహించారు. కాస్లర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రావణ భార్గవి అద్భుతంగా ఆలపించారు. -
దేవీశ్రీ ప్రసాద్ ప్రైవేట్ ఆల్బమ్‌ను లాంచ్ చేసిన కమల్‌హాసన్
తమిళ సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్.. తమిళంలోనూ పలు చిత్రాలకు సంగీతం అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ పెన్నే (ఓ అమ్మాయి) అనే పాన్ ఇండియా ప్రైవేట్ ఆల్బమ్‌ను రూపొందించారు. టి.సిరీస్ సంస్థ ద్వారా భూషణ్ కుమార్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించిన ఈ ఆల్బమ్‌కు దేవీ శ్రీ ప్రసాద్ పాటను రాసి, పాడి, సంగీతాన్ని అందించి నటించడం విశేషం. కాగా, ఈ పాట హిందీ వర్షన్ ఇటీవల బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఆవిష్కరించారు. తమిళ వెర్షన్ పాట ఆల్బమ్‌ను ఆదివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నటుడు కమలహాసన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ నటుడు కమలహాసన్ ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంతర్జాతీయ ఆల్బమ్ ఐడియాను ముందుగా తాను కమలహాసన్‌కే చెప్పానన్నారు. ఆయన ప్రోత్సాహం, ఉద్వేగమే తాను ఈ ఆల్బమ్‌ను పూర్తి చేయడానికి కారణం అయ్యాయన్నారు. స్వయం సంగీత కళాకారులు బయట ప్రపంచంలోకి రావాలనే తాను కరోనా కాలంలో రాక్ స్టార్ కార్యక్రమాన్ని నిర్వహించానని అదేవిధంగా స్వయం సంగీత కళాకారులు అన్ని భాషల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఓ పెణ్నే మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించినట్లు చెప్పారు. కమలహాసన్ మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ తనకు చాలాకాలంగా తెలుసన్నారు. ఈయన తనను ఎంతో అబ్బురపరుస్తున్నారని, ఎంతో సాధిస్తూ ఉద్వేగభరితంగా ముందుకు సాగుతున్నారన్నారు. ఒక ఉత్తమ సంగీత కళాకారుడికి ఉండాల్సిన లక్షణం ఇదే అన్నారు. ఈయనకు తమిళంలో సక్సెస్ ఆలస్యం అయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అందుకు మీ అందరి సహకారం కావాలన్నారు. అదేవిధంగా సినిమా పాటల కంటే ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్‌లు చాలా రావాలన్నారు. సంగీత కళాకారులు అందుకు కృషి చేయాలనే భావన తనకు ఎప్పుడూ ఉంటుందన్నారు. సినిమా పాటలకు సంగీత దర్శకులకు కొన్ని పరిధులు ఉంటాయని, అయితే ప్రైవేట్ పాటలకు వారి ప్రతిభను పూర్తిగా చాటే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో సినీ సంగీత దర్శకుల కంటే స్వతంత్ర సినీ సంగీత కళాకారులే ప్రముఖులు అయ్యారని వెల్లడించారు. -
Singer Parvathy: నా అదృష్టం.. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి: పార్వతి
వసంతకాలం అనగానే విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి. అలాగే, ఈ సీజన్లో తమ గానామృతంతో మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు. టాలెంట్ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు. ఊరంతా వెన్నెల... పార్వతి ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని. పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి. మట్టిగొంతుక... దుర్గవ్వ పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. ఊరటనిచ్చిన పాట.. అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్ కంపెనీలలో హౌస్ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే. ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి. మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది. – నిర్మలారెడ్డి -
బాలీవుడ్ పాటకి.. అల్లు శిరీష్ ఆట.. ఇదో రికార్డు
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నిస్తున్నాడు యంగ్ హీరో అల్లు శిరీష్. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఆల్బమ్‌లో నటించి మరో రికార్డు క్రియేట్ చేశాడు. ‘విలయాటి షరాబి’ అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్ రావల్, నీతి మోహన్ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్ లిరిక్స్ అందించారు. లిజో జార్జ్-డీజే స్వరాలు సమకూర్చారు. ఆ సాంగ్‌ను ట్విటర్లో షేర్ చేసిన శిరీష్ ‘ఆనందకరమైన పార్టీ సాంగ్ విడుదలైంది. కచ్చితంగా హోళీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’అంటూ రాసుకొచ్చారు. బాలీవుడ్ ఆల్బమ్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. -
స్ఫూర్తి శ్రుతి
‘‘మనకు మనం ప్రేరణగా నిలవలేనప్పుడు ఇతరుల్లో ఆ ప్రేరణను వెతుక్కోవాలి. ఇతరులకు ఆదర్శవంతంగా ఉండేవారిని అనుసరించాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఆశయాలను సాధించాలి’’ అంటోంది ఓ అమ్మాయి. శ్రుతీహాసన్ అంటే ఆ అమ్మాయికి చాలా అభిమానం. ఆ అభిమానమే ఆమెను ఓ చెడు అలవాటుకి దూరం చేసింది. ఒత్తిడిని అధిగమించడానికి ఆ అమ్మాయి రోజుకి 20 సిగరెట్లు కాల్చేది. అయితే ఆరోగ్యానికి అది అంత మంచిది కాదని తనకు తెలుసు. ఆమె ఈ అలవాటు మానుకోవడానికి శ్రుతి ఎలా కారణంగా నిలిచారంటే.. శ్రుతీహాసన్ చేసే ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్స్, తన గురించి చదివిన కొన్ని కథనాలు ఆ అమ్మాయికి స్ఫూర్తినిచ్చాయి. సిగరెట్ తాగడంకన్నా శ్రుతి పాటలు, కథనాలు తనకు రిలీఫ్నిచ్చాయంటోంది. పైగా శ్రుతీహాసన్ నవ్వుతున్న ఫొటోలను చూస్తుంటే ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చేస్తుందని ఆ అభిమాని పేర్కొంది. ఇవన్నీ ఆమె ధూమపానానికి దూరం కావడానికి కారణం అయ్యాయి. ‘‘నా జీవితంలో ఆశావహ దృక్పథానికి కారణమైన మీకు కృతజ్ఞతలు శ్రుతి. నేను బెటర్ పర్సన్ కావడానికి స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. శనివారంతో నేను సిగరెట్ మానేసి వంద రోజులైంది’’ అని ట్వీట్ చేసింది ఆ అమ్మాయి. కాగా గత నెల 12న ధూమపానం మానేసి 78 రోజులు అయిందని ఆ అమ్మాయి చేసిన ట్వీట్‌కి ‘నువ్వు సాధించగలవు. ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండు’ అని సమాధానం ఇచ్చారు శ్రుతీహాసన్. తాజాగా 100 రోజుల ట్వీట్‌కి స్పందిస్తూ.. పువ్వుల బొమ్మలను పోస్ట్ చేసి, ఆ అభిమానిని అభినందించారు శ్రుతి. అభిమాన తారలను స్ఫూర్తిగా తీసుకుని మంచి బాటలో వెళ్లే అభిమానులు ఉంటారు. అందుకు ఇదొక నిదర్శనం. -
ఈసారి ఆల్బమ్ కోసం...
పరిణీతీ చోప్రాలోని నటి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆమెలో గాయని కూడా ఉంది. ఆల్రెడీ ఆడియన్స్‌కు తనలోని గాయనిని ఓసారి పరిచయం చేశారు. లేటెస్ట్గా మరోసారి గొంతు సవరించుకోవడానికి రెడీ అయ్యారు పరిణీతీ చోప్రా. బాలీవుడ్ గీత రచయిత మనోజ్ ముంటషీర్ రాసిన ‘తేరి మిట్టీ’ అనే పాటను ఆలపించనున్నారు పరణీతి. అర్మాన్ మాలిక్ స్వరపరచిన ఈ పాట సినిమా కోసం కాదు... ప్రైవేట్ ఆల్బమ్. ఇదివరకు పరిణీతీ చోప్రా నటించిన ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాలో ‘మానా కే హమ్ యార్ నహీ’ అనే పాట పాడారు. ఆ పాటకు మంచి రెస్పాన్స్ లభించింది. కొంచెం గ్యాప్ తర్వాత మరో పాటతో సిద్ధమయ్యారు. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. పరిణీతి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కేసరి’ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబడుతోంది. -
అబ్బాయిని ఏ‘మార్చేసి’..
‘మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులాదాగినావుగా’ ఈ పాట వినిపిస్తే చాలు అలా అలా పాటంతా అలవోకగా పాడేసే సిటీ యూత్ చాలా మందే ఉన్నారు. అయితే.. ఓ అమ్మాయి కోసం అబ్బాయి పాడిన ఈ పాటనే అమ్మాయిలు కూడా పాడేసుకుంటున్నారు. కానీ అబ్బాయిల్ని ఉద్దేశించి పాడినప్పుడు సాహిత్యం మారితే మరింత బాగుంటుంది కదా? సిటీకి చెందిన టీనేజ్ గర్ల్స్‌లో వచ్చిన ఈ ఆలోచన సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. సాక్షి, సిటీబ్యూరో : ‘చిన్నప్పటి నుంచీ నాకు పాడడం అంటే ఇష్టం’ అని చెప్పింది స్ఫూర్తి. నగరంలోని ఎస్సార్‌నగర్, ఈఎస్ఐ ప్రాంతంలోని వికాస్పురి కాలనీలో నివసించే ఈ బీఎస్సీ స్టూడెంట్‌కి పాడడం అంటే ఉండే ఈ ఇష్టంలో విశేషం లేకపోవచ్చు. కానీ..‘మూడేళ్ల వయసులోనే ఇంట్లో ఏవైనా నాలుగైదు వస్తువులు చూస్తే చాలు అప్పటికప్పుడు పాట అల్లేసి పాడేదాన్ని. అలా మా చెల్లి మీద కూడా రాసి పాడాను’ అంటూ ఆమె గుర్తు చేసుకుంటున్నప్పుడు మాత్రం ఔరా అనిపించకమానదు. ‘నాకున్న ఆ డిఫరెంట్ టాలెంట్ గురించి నా చిన్నప్పుడే ఓ ఆంగ్ల పత్రికలో వచ్చింది. అప్పటి నుంచి ఇంకా పాడడం ఎక్కువైంది’ అంటున్న స్ఫూర్తి.. అత్యంత పిన్న వయసులోనే సినిమాలకు పాడిన యంగెస్ట్ సింగర్ కూడా. ‘యమహో యమ అనే సినిమాలో తొలి పాట పాడాను. తద్వారా యంగెస్ట్ సింగర్‌గా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నా పేరు నమోదైంది. ఆ తర్వాత కిక్ 2, లోఫర్, ఇజం.. ఇలా నాలుగైదు సినిమాల్లో పాడాను’ అంటూ చెప్పింది. అబ్బాయిని ఏ‘మార్చేసి’.. ‘పిల్లా రా పాట ట్రైన్ జర్నీలో విన్నాను. చాలాసార్లు విన్నాను. బాగా నచ్చింది. పాడుకుంటూ ఉంటే అమ్మాయిని సంబోధిస్తూ పాడడం ఎందుకో నాకు నప్పలేదనిపించి.. అప్పటికప్పుడు అమ్మాయి వెర్షన్‌గా కొన్ని వాక్యాలు మార్చి పాడాను. అలా తొలిసారి 1 నిమిషం పాటను రాసి సరదాగా అప్లోడ్ చేశాను. దీనికి 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత మ్యాంగో మ్యూజిక్ వాళ్ల సంప్రదించారు. వాళ్ల కోరిక మేరకు పూర్తి పాటను మార్చి రాసి అప్లోడ్ చేస్తే 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీనికి సూర్య అనే ఫ్రెండ్ గిటారిస్ట్‌గా వ్యవహరించాడు’ అంటూ చెప్పుకొచ్చింది స్ఫూర్తి. తాజాగా హుషారు సినిమాలోని ఉండిపోరా (విషాదభావం) అనే హిట్ సాంగ్‌ని ఫిమేల్ వెర్షన్‌లోకి మార్చి పాడిన స్ఫూర్తి ‘ఉండిపోతారా’ అంటూ బదులిచ్చినట్టుగా రాసి పాడడం ద్వారా ఇందులో మరో కొత్త ప్రయోగం జోడించింది. కేవలం వారం రోజుల్లోనే ఇది టాప్ త్రీలో నిలవడం విశేషం. ప్రస్తుతం వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకుంటున్న స్ఫూర్తి.. త్వరలో 2018లోని హాట్సాంగ్స్ అన్నీ గుదిగుచ్చి మాషప్ రూపొందించనున్నానని, మంచి గాయనిగా కావాలనేదే లక్ష్యమని, సొంత కంపోజిషన్ చేయనున్నానని చెప్పింది. అరుదుగా మాత్రం మేల్ సాంగ్‌కి ఫిమేల్ వెర్షన్‌ని రాసి పాడతానంటోంది. ఆల్ ద బెస్ట్ స్ఫూర్తి. -
నటనను నమ్ముకోలేను!
చాలా మందికి నమ్మకాన్నే కాదు జీవి తాన్నే ఇస్తున్న రంగం సినిమా. అలాంటిది కొంద రు మాత్రం సిని మాల్లో నటిస్తూనే ఆ కళామతల్లిని నమ్ముకోలేమంటూ ఇతర రంగాల్లోకి దృష్టి సా రిస్తున్నారు. ఇలా సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో తన పర భేదం లేనట్లు రెండు చేతులా గడించేస్తున్నారు. ఇక తారామణుల విషయానికొస్తే నటి నమిత, త్రిష, తమన్న, చాలా మంది ఈ పట్టికలో చేరతారు. తాజాగా నటి ఇనియ చేరారు. తానూ నటనను నమ్ముకోలేనంటున్నా రు. వాగై చూడవా చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ మలయాళ భా మ ఆ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నా ఆ తరువాత చేసిన చిత్రాలేవీ కేరీర్‌కు పెద్దగా ఉపయోగ పగలేదు.అయినా అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం జిత్తన్-2,వైగైఎక్స్‌ప్రెస్, కరైయోరం తదితర చిత్రాలతో పాటు కన్నడ,మలయాళం భాషలలోనూ నటిస్తున్నారు.అంతేకాదు అవకాశం ఉన్నప్పుడల్లా మ్యూజిక్ ఆ ల్బమ్స్,స్టేజ్ డాన్స్‌లు చేస్తున్నారు. ఇనియా మాట్లాడుతూ నటననే నమ్ముకుంటే డబ్బు గడించడం కష్టం అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్‌లలో హీ రోయిన్ల సినిమాలతో పాటు ప్రైవెట్ ఆల్బమ్‌లు ఇతర స్టేజీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాదిలోనూ నటిస్తోందని అన్నారు. తానూ ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు.తగ్గట్టు ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్స్కుసై అంటున్నారు. -
అలాంటి మాటలు ఇక నా నోట రావు!
అభిమానులు లేనిదే మేం లేమని అడపా దడపా సినిమా తారలు అంటుంటారు. అందుకే, వీలు కుదిరినప్పుడల్లా అభిమానుల కోసం కొంత సమయం కేటాయిస్తుంటారు. ఇటీవల ప్రియాంకా చోప్రా అదే చేశారు. తన అభిమానులతో సరదాగా కబుర్లు చెప్పాలనుకున్నారు. ‘నన్నేమైనా అడగండి.. ఫర్వాలేదు’ అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారామె. ఈ సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగే ప్రశ్నలన్నిటికీ కాదనకుండా సమాధానాలిచ్చి వాళ్లను ఆనందపర్చాలనుకున్నారు ప్రియాంక. కానీ, అలా చేయలేకపోయారు. ఎందుకంటే, కొంతమంది అభిమానులు అడగకూడని ప్రశ్నలేవో అడిగారు. ఇలా కూడా అడుగుతారని ఊహించని ప్రియాంక ఒక్కసారిగా ఖంగు తిన్నారు. కాసేపు ఆ షాక్‌లోనే ఉండిపోయి, ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు సమాధానాలివ్వలేదామె. అభిమానులతో సరదాగా కాలక్షేపం చేద్దామనుకున్న ప్రియాంకకు చేదు అనుభవమే మిగిలింది. ఈ విషయంలో ‘పశ్చాత్తాప పడుతున్నారా?’ అని ఓ వీరాభిమాని అడిగితే -‘‘అవును. నాకిదో కనువిప్పులాంటిది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ‘నన్నేమైనా అడగండి.. ఫర్వాలేదు’ అనే మాటలు నా నోటి నుంచి రావు. అలాగే, ఈ అనుభవం నాకో మంచి పాఠం అయ్యింది. ఇప్పుడైతే షాక య్యాను కానీ, భవిష్యత్తులో నన్నెవరైనా అడగకూడని ప్రశ్నలు అడిగితే.. వాళ్ల బతుకు మీద వాళ్లకే విరక్తి పుట్టేలా సమాధానం చెబుతా’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికి మూడు ప్రైవేట్ ఆల్బమ్స్ విడుదల చేశారు ప్రియాంక. వాటి ద్వారా తనలో మంచి గాయని ఉందని నిరూపించుకున్నారు. మరి.. సినిమాలకు ఎప్పుడు పాడతారు? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే -‘‘ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మేరీ కామ్’ కోసం ఓ పాట పాడనున్నా’’ అని చెప్పారు.