బాలీవుడ్‌ పాటకి.. అల్లు శిరీష్‌ ఆట.. ఇదో రికార్డు | Allu Sirish Makes His Hindi Debut WIth Darshan Raval Latest Album | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ పాటకి.. అల్లు శిరీష్‌ ఆట.. ఇదో రికార్డు

Published Tue, Mar 23 2021 4:20 PM | Last Updated on Tue, Mar 23 2021 5:54 PM

Allu Sirish Makes His Hindi Debut WIth Darshan Raval Latest Album - Sakshi

సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పటికీ.. సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నిస్తున్నాడు యంగ్‌ హీరో అల్లు శిరీష్‌. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్‌ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌ ఆల్బమ్‌లో నటించి మరో రికార్డు క్రియేట్‌ చేశాడు.

‘విలయాటి షరాబి’ అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్‌ రావల్‌, నీతి మోహన్‌ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్‌ లిరిక్స్‌ అందించారు. లిజో జార్జ్‌-డీజే స్వరాలు సమకూర్చారు. ఆ సాంగ్‌ను ట్విటర్‌లో షేర్‌ చేసిన శిరీష్‌ ‘ఆనందకరమైన పార్టీ సాంగ్‌ విడుదలైంది. కచ్చితంగా హోళీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్‌ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’అంటూ రాసుకొచ్చారు. బాలీవుడ్‌ ఆల్బమ్‌ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement