బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 9 మెంబర్స్ మిగిలారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేలో అడుగుపెడతారు. ఈరోజు మండే కావడంతో నామినేషన్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటికీ సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేస్తానంటే కుదరదని తెగేసి చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నామినేట్ చేయమన్నాడు. ఈ క్రమంలో శ్రీసత్య.. ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజ్ మూడు వారాల నుంచి సేవ్ అవుతున్నాడని నామినేట్ చేసింది. దీంతో బిగ్‌బాస్ తుప్పాస్ రీజన్ కాకుండా ఏదైనా వాలిడ్ పాయింట్ చెప్పమన్నాడు.
మరోవైపు రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లకు కడుపు నిండా తిండి దొరక్కుండా పోయింది. ఉన్నదాన్ని పంచి పెట్టకుండా దాచి దెయ్యాలపాలు చేస్తున్నాడు. గతంలోనూ అలాగే చేయగా మరోసారి ఫుడ్ కట్ చేస్తున్నాడు. అంత కొద్దిగా వండితే సరిపోవట్లేదు మహాప్రభో అని మొత్తుకుంటున్నా నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించాడు. వారమంతా సరిగా తినీతినకుండా వారాంతంలో మాత్రం కడుపు నిండా పెడతానంటే కరెక్ట్ కాదు. అందువల్ల కెప్టెన్‌గా నువ్వు గెలుస్తావేమో కానీ అందరి ఆకలి తీరదు అని ముఖం మీదే చెప్పాడు శ్రీహాన్.
రేషన్ సేవ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్ అయ్యాడు. నిజంగానే రేవంత్ ఎంతసేపూ గేమ్ కోణంలో ఆలోచిస్తున్నాడే కానీ మానవత్వంతో ఓ ముద్ద ఎక్కువ పెట్టుంటే హౌస్‌మేట్స్ అందరితో మంచి కెప్టెన్ అనిపించుకునేవాడు. ఇకపోతే ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్‌లో ఉన్నారు.
చదవండి: బిగ్‌బాస్ 6: బాటమ్ 5లో ఎవరంటే?
మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే!
Comments
Please login to add a commentAdd a comment