Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు.
అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్‌లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్‌లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు.
ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్‌లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి.
అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్.
మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు?
శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది.
రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది?
ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్‌టైన్ పక్కన పెట్టేశాను.
మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి..
ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి.
ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్‌ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా?
శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్‌ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్‌షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్‌ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను.
చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ
కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా
Comments
Please login to add a commentAdd a comment