![Bigg Boss Telugu: Nagarjuna Funny Satires On Singer Revanth - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/11/revanth-sri-satya.gif.webp?itok=1TFR3lwt)
సండే ఫండే ప్రోమో వచ్చేసింది. ఈ సారి కూడా కంటెస్టెంట్లతో సరదా గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. వంద రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న ఏడుగురికి ఇంటి గురించి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో ఎన్ని గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయి? వాష్‌రూమ్ ఏరియాలో ఎన్ని పూలకుండీలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలడిగాడు.
నాగార్జున ప్రశ్న అడగ్గానే ఎవరు గంట కొడితే వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే రెండు పాయింట్లు జోడిస్తానని, తప్పు సమాధానం చెప్తే రెండు పాయింట్లు మైనస్ చేస్తానన్నాడు. వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లున్నాయి అని అడగ్గా ఆదిరెడ్డి పది మెట్లు అని చెప్పాడు. నాగార్జున మైనస్ 2 అన్నాడు. అప్పటికే బెల్ కొట్టిన శ్రీసత్య 7 లేదా 8 అని చెప్పింది. 7 మెట్లు సరైన సమాధానమంటూ వెంటనే ఒక పాయింట్ ఇచ్చాడు నాగ్. అదేంటి సర్, ఆమె రెండు ఆప్షన్లు చెప్పింది కదా అని రేవంత్ సందేహం వ్యక్తం చేయగా.. 'నేను సంచాలక్, నా ఇష్టం. అయినా ఇది నేను రేవంత్ దగ్గరే నేర్చుకున్నాను' అని పంచ్ ఇచ్చాడు.
చదవండి: లేడీ సింగాన్ని పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా?
ఈ వారం ఇనయ ఎలిమినేట్?
Comments
Please login to add a commentAdd a comment