Bigg Boss Telugu 6: Nagarjuna Fires On Revanth - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఉండే అర్హత అతడికే ఎక్కువట! ఆమె అనర్హురాలు..

Published Sat, Oct 22 2022 3:51 PM | Last Updated on Sat, Oct 22 2022 4:41 PM

Bigg Boss Telugu 6: Nagarjuna Fires On Revanth - Sakshi

హౌస్‌లో ఉండేందుకు ఎవరు అనర్హులు? అని బిగ్‌బాస్‌ నిన్ననే ఇంటిసభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాడు. ఎక్కువమంది వాసంతి అనర్హురాలు అని చెప్పడంతో ఆమెను జైల్లో కూడా వేశారు. ఇందుకు వాసంతి బాధపడటం పక్కనపెట్టి అదేదో గొప్పగా ఫీలైంది. నేను బాగా ఆడాను కాబట్టే జైలుకు వెళ్లానని నాగార్జునతో చెప్పుకొచ్చింది. ఆమె సమాధానం విని అవాక్కైన నాగ్‌ జైలుకు వెళ్తే అర్హురాలివని ఫీలవుతున్నావా? అని అడిగాడు. దీనికామె ఏం సమాధానం చెప్పాలో తెలీక బిక్కముఖం వేసుకుంది.

ఇక నాగ్‌.. ఇంట్లో ఉండేందుకు ఎవరు డిజర్వ్‌ అనుకుంటున్నారో చెప్పమని ఒక్కొక్కరిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచి అడిగాడు. అనూహ్యంగా చాలామంది శ్రీహాన్‌ అర్హుడని తేల్చేశారు. మెరీనా పెద్దగా ఆడట్లేదు కాబట్టి ఆమె అనర్హురాలని పేర్కొన్నారు. గేమ్‌లో రేవంత్‌.. అర్జున్‌ను పప్పు అనడాన్ని ప్రస్తావించాడు నాగ్‌. రేవంత్‌ మాట్లాడిన ప్రతిసారి పప్పు నువ్వు ఆగు అంటూ అవహేళన చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది అని శ్రీసత్యను అడిగాడు. నలుగురు ఫ్రెండ్స్‌ ఉన్నప్పుడు ఏం అనుకున్నా ఓకే కానీ గేమ్‌లో అందరిముందు నువ్వుండ్రా పప్పు అనడం తప్పనిపించింది అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై నాగ్‌ రేవంత్‌కు గట్టిగానే కోటింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇక ఎవరు నామినేట్‌ అవుదామనేది చిట్టీలు వేసి డిసైడ్‌ అవుదామన్న శ్రీసత్య, తన పేరు చీటీలో వచ్చేసరికి ఓటింగ్‌ పెట్టుకుందామంది. అలా శ్రీసత్య సేఫ్‌ అయి ఓటింగ్‌ వల్ల వాసంతి నామినేట్‌ అయింది. ఈ విషయంలో శ్రీసత్య మైండ్‌గేమ్‌ను బయటపెట్టాడు నాగ్‌.

చదవండి: జపాన్‌ వీధుల్లో రామ్‌చరణ్‌, తారక్‌ సందడి
ఇంటర్నేషన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అఖండ, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement