Bigg Boss 6 Telugu Episode 67 Highlights: 10th Week New Captain Confirmed - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: తనే కొత్త కెప్టెన్‌, రేవంత్‌పై టార్గెట్‌.. ఏడ్చేసిన సింగర్‌

Published Wed, Nov 9 2022 11:57 PM | Last Updated on Thu, Nov 10 2022 9:19 AM

Bigg Boss 6 Telugu: This Contestant New Captain Of 10th Week - Sakshi

Bigg Boss Telugu 6, Episode 67: బిగ్‌బాస్‌ షో మొదలై పది వారాలు కావస్తోంది. ఇప్పటివరకు కెప్టెన్‌ కాలేని వాళ్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు ఈవారం కెప్టెన్‌గా అవతరించారు. మరి ఆ కొత్త కెప్టెన్‌ ఎవరు? ఈ రోజు ఎపిసోడ్‌ ఎలా జరిగిందో తెలియాలంటే నేటి బిగ్‌బాస్‌ హైలైట్స్‌ చదివేయాల్సిందే!

నిన్నటి గేమ్‌లో అవుట్‌ అయిన సత్య, ఇనయ, వాసంతి, రోహిత్‌ తిరిగి రేస్‌లోకి వచ్చేందుకు మంచి ఆఫరిచ్చాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా వీళ్లు ప్రత్యర్థుల మీద స్టిక్కర్స్‌ అతికించాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సత్య, రోహిత్‌ విజయం సాధించి తిరిగి కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో పాల్గొన్నారు. ఆటలో ఓడిపోయినందుకు ఫ్రస్టేట్‌​ అయిన ఇనయ ఏదో బూతు మాట్లాడేసి తర్వాత అనుకోకుండా అన్నానని సారీ చెప్పింది.

కెప్టెన్సీ కంటెండర్లు అవడానికి బిగ్‌బాస్‌ చివరగా నాగమణి అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో నిచ్చెన టీమ్‌(బాలాదిత్య, రాజ్‌, రేవంత్‌, సత్య, మెరీనా,) మణులను కాపాడుకోవాల్సి ఉండగా మిగతా టీమ్‌ వాటిని దక్కించుకోవాల్సి ఉంటుంది. నిచ్చెన టీమ్‌ దగ్గరున్న మణులను పాము టీమ్‌ సభ్యులు తీసుకునేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా మొట్టమొదటగా రేవంత్‌ను కావాలని రెచ్చగొడితే అతడు ఆటాడకుండా పక్కకు తప్పుకుంటారని ప్లాన్‌ వేశారు. గేమ్‌ మొదలు కాగానే అదే ప్లాన్‌ను అమల్లో పెట్టారు.

రేవంత్‌ జస్ట్‌ తోసేసినా సరే ఫిజికల్‌ అవుతున్నాడంటూ కావాలని రెచ్చగొట్టారు. వారి మాటలకు ఆవేశంతో ఊగిపోయిన రేవంత్‌ ఫిజికల్‌ అయితే తోలు తీస్తా అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఆదిరెడ్డి, ఫైమా అయితే రేవంత్‌కు మరింత కోపం తెప్పించేందుకు ప్రయత్నించారు. అవతలి టీమ్‌లోని శ్రీహాన్‌ , ఆది రెడ్డి అయితే బాలాదిత్య, రేవంత్‌ల కాళ్లు పట్టుకుని ఈడ్చుకు లాగారు. ఆట ముగిసేసరికి సంచాలకులుగా వ్యవహరించిన వాసంతి, ఇనయ పాము టీమ్‌ గెలిచినట్లు తెలిపారు. దీంతో ఆ టీమ్‌లోని ఫైమా, ఆదిరెడ్డి రోహిత్‌, కీర్తి కెప్టెన్సీ కోసం పోటీపడారు.

నాగ్‌ ఇచ్చిన పనిష్మెంట్‌ కారణంగా శ్రీహాన్‌ పోటీపడే అర్హత కోల్పోయాడు. అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోవచ్చని బిగ్‌బాస్‌ తెలపడంతో శ్రీహాన్‌.. తన స్థానంలో శ్రీసత్య పోటీపడుతుందని తెలిపాడు. బంగారు మణి నిచ్చెన టీమ్‌లోని మెరీనా దగ్గర ఉండటంతో ఆమె సైతం కెప్టెన్సీ బరిలో నిలిచింది. ఇక ఈ గేమ్‌లో ఫైమా కొత్త కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అందరూ తన వీక్‌నెస్‌ మీద కొట్టడాన్ని తట్టుకోలేకపోయాడు రేవంత్‌. 'టాస్క్‌ సమయంలో నేను కోప్పడుతున్నానని కావాలని లేనిపోనివి చెప్పి నా కాళ్లూచేతులు కట్టేశారు. ఇంకోసారి ఫిజికల్‌గా ఆడితే ఎల్లో కార్డ్‌ ఇస్తానన్నారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఈ బిగ్‌బాస్‌ హౌస్‌కి రాకుండా ఉండాల్సింది' అంటూ ఎమోషనలయ్యాడు రేవంత్‌.

చదవండి: బిగ్‌బాస్‌: గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?
ఫిజికల్‌ అన్నారంటే తోలు తీస్తా: రేవంత్‌ వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement