Bigg Boss Telugu 6, Day 99 Promo: Sri Satya, Revanth Emotional After Watching Their BB House Journey Videos - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: జర్నీ చూసి భావోద్వేగానికి లోనైన రేవంత్‌, శ్రీసత్య

Published Mon, Dec 12 2022 4:12 PM | Last Updated on Mon, Dec 12 2022 11:27 PM

Bigg Boss 6 Telugu: Sri Satya, Revanth Emotional After Watching their Journey Videos - Sakshi

జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి

బిగ్‌బాస్‌.. నిన్ను నీకే కొత్తగా చూపిస్తుంది. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. షో ముగిసేసరికి నీకు నువ్వే కొత్తగా పరిచయమయ్యేలా చేస్తుంది. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ ద్వారా ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తాడు. ఎవరితోనూ కలవని వాళ్లు కూడా అందరితో కలిసిపోతారు. తమలోని తప్పొప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ జర్నీ ముగింపుకు వచ్చింది. ఈ ఆదివారంతో షోకు శుభం కార్డు పడనుంది.

దీంతో హౌస్‌లో మిగిలిన ఆరుగురికి వారి జర్నీలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్‌. తమ ప్రయాణాన్ని చూసి హౌస్‌మేట్స్‌ భావోద్వేగానికి లోనవుతున్నారు. కప్పు గెలుచుకుని ఇంటికి రా అంటూ అక్క ఫోన్‌ చేసి కోరడంతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. భుజాలపై బరువును చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలి సత్తువ చూపించడమే మొదటి విజయం. మీరు చిరునవ్వుతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు బిగ్‌బాస్‌. ఆ మాటలతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య.

అటు రేవంత్‌.. బొమ్మను ఎత్తుకుని గెలిచి ఇంటికెళ్లాక నా కూతురిని ఇలాగే ఎత్తుకుంటానంటూ నమ్మకంతో చెప్తున్నాడు. 'మీ కోపమే బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని అందుకు తగ్గుట్గా మారి మీ కోపాన్ని ప్యాషన్‌గా మార్చారు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి బిగ్‌బాస్‌ గేమ్‌ కోసం ఎంతదూరమైనా వెళ్లాలని ఆరాటపడ్డారు' అంటూ రేవంత్‌పై పొగడ్తలు కురిపించాడు బిగ్‌బాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement