జర్నీని చూసి కళ్లు చెమర్చిన శ్రీసత్య, గెలుపుపై రేవంత్‌ ధీమా! | Bigg Boss Telugu 6: Revanth, Sri Satya Full Happy for Their Journey Videos | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: వారే నిజమైన విజేతలు.. బిగ్‌బాస్‌ చెప్పింది నిజమే కదా!

Published Mon, Dec 12 2022 11:33 PM | Last Updated on Mon, Dec 12 2022 11:38 PM

Bigg Boss Telugu 6: Revanth, Sri Satya Full Happy for Their Journey Videos - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 100: బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో టాప్‌ 6 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు రెడీ అయ్యాయి. ఈరోజు ఇద్దరు హౌస్‌మేట్స్‌ జర్నీలను వారి కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతేకాకుండా ఇప్పటివరకు ఆడిన టాస్కులకు సంబంధించిన వస్తువులను గార్డెన్‌ ఏరియాలో ఉంచి పెట్టాడు. హౌస్‌లో సంతోషకరమైన, బాధాకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను అక్కడక్కడా అతికించాడు. మొదటగా రేవంత్‌ను గార్డెన్‌ ఏరియాలోకి రమ్మని పిలుపు వచ్చింది. డోర్‌ తీసుకుని బయటకు వచ్చిన రేవంత్‌ ఆ సెట్టింగ్‌ చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాడు. అక్కడున్న బొమ్మను తీసుకుని ఈ షో గెలిచి ఇంటికి వెళ్లాక నా కూతుర్ని ఇలాగే ఎత్తుకుంటానని ఊహల్లో తేలిపోయాడు. ఇంతలో అతడికి భార్య అన్విత నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఎంతమంది ఉన్నా నువ్వు లేవనే బాధ ఉంది. కానీ నువ్వు గెలిచి రావాలని చెప్పడంతో సంతోషపడిపోయాడు రేవంత్‌.

తర్వాత ఎప్పటిలాగే బిగ్‌బాస్‌ ఉపన్యాం అందుకున్నాడు. 'ఇప్పటివరకు గాత్రానికి సంబంధించిన ఎన్నో పోటీల్లో మీరు గెలిచారు. ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టారు. మొదటి రోజు నుంచే మీరు చూపించిన దూకుడు ఇతర పోటీసభ్యులకు తమ పోటీ ఎవరనే విషయాన్ని స్పష్టం చేసింది. మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఓటమిని తీసుకోలేని మనస్తత్వం చుట్టూ ఉన్నవారికి మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశాన్నిచ్చింది. కోపాన్ని ఆయుధంగా కాకుండా ప్యాషన్‌గా మార్చారు. అది మీ నాయకత్వ లక్షణాలను, పట్టుదలను రెట్టింపు చేసింది. మీ ఆకలి.. టాస్కుల్లో ఎంత చూపించారో, హౌస్‌లో కూడా అంతే చూపించారు. దాచుకుని తినడంలో మీలోని చిన్నపిల్లాడి అమాయకత్వాన్ని బిగ్‌బాస్‌ గమనించాడు.

మీ కోపం పరదా వెనకున్న సున్నిత మనసు బిగ్‌బాస్‌కు తెలుసు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. వాటన్నింటినీ దాచుకోకుండా ప్రేక్షకులకు చూపించినతీరు మిమ్మల్ని వారికి ఇంకా దగ్గర చేసింది. జీవితంలో తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకుని ఇంటిసభ్యులకు దూరంగా ఉంటూ ఓవైపు కలతగా ఉన్నా, మరోవైపు గెలుపు కోసం ఎక్కడిదాకానైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపింది...' అంటూ అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. అది చూసి ఎమోషనలైన రేవంత్‌.. బిగ్‌బాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకున్నాడు.

తర్వాత శ్రీసత్యకు పిలుపు వచ్చింది. రాగానే అక్కతో ఫోన్‌ మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె గురించి బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషి మొదటి విజయం. ఆ పట్టుదల, మొండితనం రెండూ ఉన్నాయి. కాబట్టే మీరు బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగుపెట్టారు. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఒక సంకోచ స్థితి మీ ఆటపై నుంచి దృష్టిని తప్పించినప్పుడు మీ అమ్మ కోసం బిగ్‌బాస్‌ ఇంట్లోకి మీరు వచ్చిన కారణం, అందుకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యం గుర్తొచ్చాయి.

ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు.. మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి ఈ ప్రయాణాన్ని సులువు చేశారు. మీ నవ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ నిలిచిపోయేలా మీ బలాన్ని మీకు గుర్తు చేసిన తీరు మిమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. సరైన వ్యక్తులు సరైన సమయంలో జీవితంలోకి రావడం ఎంత బలమో డీటాచ్‌మెంట్‌ను నమ్మే మీకు కొత్త అనుభవం. మన బలాన్ని మనం నమ్మిన తర్వాతే ప్రపంచం నమ్ముతుంది. అది నమ్మడం మొదలుపెట్టినప్పుడే మీరు కెప్టెన్‌ అయ్యారు. పద్నాలుగు వారాల ప్రయాణంలో ఒక్కోవారం మీకన్నా బలంగా ఉన్నవారిని దాటుకుంటూ ఆటలో ఆఖరి దశకు చేరుకున్నారు. మీ లక్ష్యం వైపు ఇలాగే ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆల్‌ దె బెస్ట్‌ చెప్పాడు బిగ్‌బాస్‌. తర్వాత తన జర్నీ చూసి ఎమోషనలైంది శ్రీసత్య. మిగతా హౌస్‌మేట్స్‌ జర్నీ రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

చదవండి: సూర్యతో లవ్‌లో ఉన్నానని చెప్పానా? యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ
అమర్‌తేజుల హల్దీ ఫంక్షన్‌, ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement