
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ రద్దయింది. బిగ్‌బాస్ ఇచ్చిన ‘సెలెబ్రెటీ గేమింగ్ లీగ్’ టాస్క్‌ని కంటెస్టెంట్స్ సరిగా ఆడలేదు. దీంతో బిగ్‌బాస్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆటను చూడలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఆశించిన స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలేదంటూ.. టాస్క్‌నే నిలివివేశాడు. హౌస్‌లో ఈ వారం కెప్టెన్ ఉండబోడని స్పష్టం చేశాయి.
(చదవండి: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. కెప్టెన్సీ టాస్క్ నిలిపివేత)
అయితే ఈ టాస్క్ రద్దుకు శ్రీసత్య కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అర్జున్‌ని రెచ్చగొట్టిమరి రేవంత్‌తో గొడవకు దిపింది. దీంతో వారు పాత్రల్లోని బయటకు వచ్చి గొడవపడ్డారు. అసలు విషయం ఏంటంటే.. రెండు టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్స్‌కి ‘వాల్‌పోస్టర్’అనే చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇరు టీమ్ సభ్యులు.. వాల్‌పోస్టర్లను అతికించడం ప్రారంభించారు. మధ్యలో అర్జున్ ఏదో అంటుంటే.. ‘అరేయ్ పప్పు’అని రేవంత్ అంటాడు.
ఆ విషయాన్ని అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య మాత్రం ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పాత్రల్లోంచి బయటకు వచ్చి మరి తిట్టుకుంటారు. ఈ గొడవ తర్వాత ఇంటి సభ్యులెవరు తమ తమ పాత్రల్లో ఉన్నట్లు కనిపించదు. అసలే ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. పోనీ గేమ్ అయినా సరిగా ఆడుతున్నారా అంటే అదీ లేదు. అందుకే బిగ్‌బాస్ రంగంలోకి దిగి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి కంటెస్టెంట్స్‌ని ఏ సీజన్‌లో చూడలేదని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ ఆదేశాలను, ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇష్టం లేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవచ్చుని గేట్లు ఎత్తేశాడు. దీంతో ఇంటి సభ్యులు దిగొచ్చి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ బిగ్‌బాస్ కరగలేదు. ఈ వారం టాస్కే లేదని చెప్పేశాడు. మరి ఇప్పుడు హౌజ్‌మేట్స్ ఏం చేస్తారో? గేమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment