![Bigg Boss Telugu 6: Shrihan Gets Emotional In Battery Recharge Task - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/11/srisatyashriha.gif.webp?itok=r_9OSEo7)
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ వరుసగా ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఈపాటికే నామినేషన్స్ అయిపోగా ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఈ మేరకు హౌస్‌మేట్స్‌కు రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మనసుకు ఎంతో దగ్గరైన వాళ్లకు ఇన్నిరోజులు దూరంగా ఉండటం సులభమైన విషయం కాదు. అందుకే, ఈవారం ఇంటిసభ్యులందరికీ వారి బ్యాటరీలను రీచార్జ్ చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు కొనసాగే అవకాశాన్ని కల్పిస్తూ 'బ్యాటరీ రీచార్జ్' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అందులో భాగంగా శ్రీహాన్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు.
నచ్చిన వ్యక్తుల నుంచి వీడియో కాల్, ఆడియో మెసేజ్ లేదంటే ఫుడ్.. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోమన్నాడు. కానీ శ్రీహాన్ తనకు ఏదీ వద్దని చెప్పగా మూడింటిలో ఒకటి ఎంచుకోకపోతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, వాటిని ఇంటిసభ్యులందరూ ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. దీంతో అతడు ఆ మూడింట్లో ఒకటి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్ కంటతడి పెట్టుకోగా అటు శ్రీసత్య కూడా ఈరోజు మా అమ్మకు నిద్ర పట్టదంటూ ఏడ్చేసింది. మరి వీరి బాధకు కారణమేంటి? అసలు ఈ బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఎలా జరిగింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
చదవండి: తుప్పాస్ రీజన్స్ అంటూ రాజ్‌పై గీతూ ప్రతీకారం..
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు..
Comments
Please login to add a commentAdd a comment