
బిగ్‌బాస్ షోలో ఈ వారం కంటెస్టెంట్లకు పండగే పండగ. వారి కోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. వారు కోరుకున్నట్లుగా వీడియో కాల్, ఆడియో కాల్, ఫుడ్.. ఇలా కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ వారిని సంతోషపరుస్తున్నాడు. అయితే వాటిని ఎంచుకునే క్రమంలో కొన్నింటిని త్యాగం కూడా చేయమంటున్నాడు. మరి బిగ్‌బాస్ ఏది చేసినా ఊరికే చేయడు కదా! ఇప్పటికే శ్రీహాన్ ఇంటి ఫుడ్ తినగా సుదీప తన భర్తతో ఆడియో కాల్ మాట్లాడింది. ఆదిరెడ్డి అయితే ఏకంగా భార్యాబిడ్డలతో వీడియో కాల్ మాట్లాడాడు.
ఈరోజు మరికొందరికి అలాంటి అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. అందులో భాగంగా బ్యాటరీ రీచార్జ్ కావాలంటే ఫైమా సినిమా కథను ఇంగ్లీష్‌లో వివరించాల్సి ఉంటుందన్నాడు. ఫైమా చెప్పినట్లు చేయడంతో బ్యాటరీ రీచార్జ్ అయింది. ఇక బాలాదిత్య తన కూతురితో మాట్లాడగా ఇనయకు తల్లిదండ్రుల ఫొటో అందడంతో ఆమె ఆనందం పట్టలేక ఏడ్చేసింది. అలాగే శ్రీసత్య తన పేరెంట్స్‌తో వీడియో కాల్ మాట్లాడింది. ఈ వరుస సర్‌ప్రైజ్‌లతో బిగ్‌బాస్ హౌస్ ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది.
చదవండి: దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్ లీక్
బాలాదిత్య ఆ పని చేయాల్సిందే లేదంటే అందరూ పస్తులుండాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment