
Adi Reddy In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ రివ్యూలతో పాపులర్ అయిన ఆదిరెడ్డి కామన్ మ్యాన్‌గా ఈసారి బిగ్‌బాస్ సీజన్-6లో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అసలు ఆదిరెడ్డి ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అన్న విషయాల గురించి నెట్టింట చర్చ మొదలైంది. నెల్లూరులో ఉదయగిరిలోని వరికుంటపాడు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.
ఫ్రెండ్ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్ సీజన్-2పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్‌లోడ్ చేయగా ఆ వీడియో పాపులర్ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి బిగ్‌బాస్ షోలపై తనదైన విశ్లేషణతో గుర్తింపు పొందాడు. మరి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఆదిరెడ్డి బిగ్‌బాస్ షోలో ఎలా అలరిస్తాడో చూద్దాం.