venkata krishna
-
ఏబీఎన్ వెంకటకృష్ణను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి చానల్ పాత్రికేయుడు పర్వతనేని వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజులపాటు విచారించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రపన్నారనే అభియోగాలపై కొన్ని నెలల కిందట నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్లపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల టీవీ 5 మూర్తిని సీఐడీ అధికారులు విచారించారు. అదే కేసులో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి చానల్ పాత్రికేయుడు వెంకటకృష్ణను సీఐడీ అధికారులు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం, మంగళవారం దాదాపు 15 గంటలపాటు విచారించారు. చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు) -
మహోజ్వల భారతి: దివిసీమ గాంధీ!
మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తండ్రి. నేడు కృష్ణారావు జయంతి. ఆయన 1926 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో వెంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా మన్ననలనందుకున్నారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెళ్లి ఓదార్చాలి’ అని ఆయన ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి. కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను ఆనాడు పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అక్కడే ‘అంతర్జాతీయ తెలుగు సంస్థ’ను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. కృష్ణారావు ఆ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వెంకట కృష్ణారావు కృషిని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమ లోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు కూడా మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టారు. కృష్ణారావు 1997 సెప్టెంబర్ 27న 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. మృదుమధురశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. ఆయన కవిత్వం సులభ శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారంతో సొంపుగా ఉంటుంది. ఖండకావ్యాల రచన ఆయన ప్రత్యేకత. కరుణ రస ప్రధానంగా అనేక కవితలు రాసి ‘కరుణశ్రీ‘ అని ప్రసిద్ధులయ్యారు. కరుణశ్రీ ‘పుష్పవిలాపము‘, ‘కుంతి కుమారి’ కావ్యాలతో ప్రసిద్ధులయ్యారు. ఇక ఆయన కవితాత్రయం ‘ఉదయశ్రీ’, ‘విజయశ్రీ’, ‘కరుణశ్రీ’ అత్యధిక ముద్రణలు కలిగి, ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. నేడు కరుణశ్రీ జయంతి. ఆయన గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్నప్పుడే పాపయ్యశాస్త్రికి సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠంలోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేశారు.1992 జూన్ 22న పరమపదించారు. -
ట్రైలర్ బాగుంది
‘‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్ చూశాను. మేకింగ్, సినిమాటోగ్రఫీ స్టయిలిష్‌గా ఉన్నాయి. కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శ్రీనివాస్ బాగా తీశాడు’’ అన్నారు దర్శకుడు రాంగోపాల్‌వర్మ. 3జీ ఫిలిమ్స్ సమర్పణలో ‘మజిలీ’ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూసైడ్ క్లబ్‘. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వంలో ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3జీ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వర్మగారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. త్వరలో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు శ్రీనివాస్ బొగడపాటి. ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి. -
వాస్తవ సంఘటనలతో...
‘మజిలీ’ ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రవీణ్, ప్రభు, వెంకటేశం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రం ట్రైల్ షోను నిర్వహించారు చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించాను. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. యాక్టర్స్ అందరూ పాత్రలకు పక్కాగా సూట్ అయ్యారు’’ అన్నారు. ‘‘తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాం. రాత్రి, పగలు షూటింగ్ చేశాం. మా ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాం’’ అన్నారు శివ. -
రూ.కోట్ల స్థలం..ధారాదత్తం
సాక్షి, ఒంగోలు అర్బన్: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాటి నగరపాలక కమిషనర్ వెంకటకృష్ణ కుమ్మక్కై కోట్ల విలువైన స్థలాన్ని తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారు. నగరపాలక సంస్థకు చెందిన దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లో ఎటువంటి అనుమతులు లేకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 షాపులు నిర్మించి ధారాదత్తం చేశారు. మార్కెట్ విలువ ప్రకారం సదరు స్థలం రూ.3 కోట్లపైనే ఉంటుంది. ఆ కాంప్లెక్స్‌కు డీజే (దామచర్ల జనార్దన్) కాంప్లెక్స్ అని కూడా నామకరణం చేశారు. సదరు డీజే కాంప్లెక్స్‌కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగం అధికారులు, అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఒకరికి ఒకరు పొంతన లేని వివరణలు ఇవ్వడం విశేషం. అధికారుల తడబాటును చూస్తే కచ్చితంగా కూరగాయల మార్కెట్లోని డీజే కాంప్లెక్స్ అనధికారిక నిర్మాణం అని తేటతెల్లమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి నగరపాలక అధికారులు ఎంత నలిగిపోతున్నారో డీజే కాంప్లెక్స్‌పై వివరణలు చెప్పడంలో అర్థమవుతోంది. ఇంకా ఎవరికీ షాపులు కేటాయించలేదని ఒక అధికారి అంటుంటే మరొకరు వేలం వేసి కేటాయించామని అంటున్నారు. ఇంకొకరు మాకేం సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆయన హయాంలో ఒక్క పేదవాడికి ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బాలినేని సుమారు 10 వేల పట్టాలు పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మొదట్లో ఊరచెరువు సర్వే నంబర్ 14/1లోని 7 ఎకరాల స్థలంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిర్మాణాలు చేసి అగ్రికల్చర్ మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంది. 2007లో సదరు 7 ఎకరాలను నగరపాలక సంస్థ ఏఎంసీతో ఒప్పందాలు చేసుకుని స్వాధీన పరుచుకుంది. అప్పటి నుంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. మార్కెట్లో పడమర వైపు రిటైల్ కూరగాయల వ్యాపారం కోసం షాపులు కేటాయించగా, తూర్పు వైపు డిజైన్ ప్రకారం హోల్‌సేల్ మార్కెట్ షాపులు కేటాయించారు. హోల్‌సేల్ షాపులకు దక్షిణం వైపున డిజైన్ ప్రకారం లోడ్‌తో వచ్చిన లారీలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే కన్ను ఆ స్థలంపై పడింది. అంతే వెంటనే నాటి ఓఎంసీ కమిషనర్‌కు హుకుం జారీ చేసి ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు షాపుల కేటాయించాలని వారే స్వయంగా నిర్మించుకుంటారని చెప్పడంతో వెంటనే షాపుల నిర్మాణం జరిగిపోయి డీజే కాంప్లెక్స్‌గా వెలిసింది. డీజే కాంప్లెక్స్ ఏర్పడేందుకు సహకరించిన కమిషనర్‌కు, దానికి ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యేకు దాదాపుగా రూ.10 లక్షలు ముట్టినట్లు సమాచారం. ముస్లింల నోరుకొట్టి.. అక్రమంగా నిర్మించి టీడీపీ కార్యకర్తలకు కేటాయించిన డీజే కాంప్లెక్స్‌కు పడమర వైపు కూతవేటు దూరంలో ఉన్న బండ్లమిట్టలో గత 30 ఏళ్లుగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న ముస్లింలకు చెందిన షెడ్లను స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్లు పోలీసు బందోబస్తుతో పొక్లయినర్లతో బలవంతంగా 2015లో తొలగించారు. ఆ సమయంలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. కేవలం బాలినేని అభిమానులు కావడం వలనే 30 ఏళ్ల నాటి వ్యాపార కేంద్రాలను కూలదోశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ముస్లింల షాపుల తొలగింపుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మరీ.. 14/1 ఊరచెరువుకు సంబంధించి మొత్తం 77 ఎకరాల స్థలం ఉండగా దానిలో 7 ఎకరాల్లో దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ ఉంది. ఒక ప్రైవేటు వ్యక్తి స్థలానికి సంబంధించి నగరపాలక సంస్థతో వివాదం ఉండటంతో హైకోర్టును (రిట్ పిటిషన్ 7981/2012) ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు సదరు సర్వే నంబర్‌ను వాటర్ బాడీగా భావిస్తూ ఆ సర్వే నంబర్లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే కోర్టు ధిక్కారం కింద వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులచే కాంప్లెక్స్ నిర్మాణం చేసి షాపులను కేటాయించారు. దానికి నాటి కమిషనర్ పూర్తిస్థాయిలో సహకరించి నగరపాలక ఆస్తులను ధారాదత్తం చేశారు. మొత్తం మీద టీడీపీ కార్యకర్తలకు షాపులు ఇచ్చినా బిజినెస్ బిజినెస్సే.. బావమరిది బావమరిదే అన్నట్లు లక్షల్లో వసూలు చేసుకున్నారు. దీనిపై వివరణ అడిగితే నగరపాలక అధికారులు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. ఎన్నికలయ్యాక వేలం నిర్వహిస్తాం.. బాధ్యతలు స్వీకరించే సమయానికే కాంప్లెక్స్ ఉంది. అయితే ఆ షాపులు ఇంకా ఎవరికీ కేటాయించలేదు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ ప్రక్రియ నిలిపివేశాం. ఎన్నికల అనంతరం వేలం నిర్వహించి పద్ధతి ప్రకారం షాపుల కేటాయిస్తాం. – శకుంతల ప్రస్తుత కమిషనర్ మార్కెట్ లోపల నిర్మాణాలకు మాకు సంబంధం లేదు మార్కెట్ లోపల జరిగిన నిర్మాణాలకు, మాకు ఎటువంటి సంబంధంలేదు. ఏ విధంగా కేటాయించారు, ఎలా నిర్మించారనే వివరాలు మాకు తెలియవు. ఆ కాంప్లెక్స్‌కు సంబంధించి మాకు ఎలాంటి ఉత్తర్వులు పై అధికారుల నుంచి రాలేదు. కమిషనర్ ద్వారా వివరాలు తీసుకోండి. – కె.వెంకటేశ్వర్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ కౌన్సిల్ తీర్మానం అయింది కలెక్టర్ ఉత్తర్వులు రావాలి డీజే కాంప్లెక్స్‌లోని షాపులకు వేలం నిర్వహించాం. దానికి సంబంధించిన తీర్మానం కూడా చేశాం. అయితే ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్ నుంచి అప్రూవల్ రావాలి. షాపునకు వెయ్యి రూపాయల లెక్కన వేలం నిర్వహిస్తే రూ.1200, రూ.1300 లెక్కన పాట జరిగింది. – శంకర్(ఆర్ఓ) రెవెన్యూ అధికారి వివరాలు ఆర్ఓని అడగాలి డీజే కాంప్లెక్స్‌కు సంబంధించి ఎటువంటి పన్నులు లేవు. కేవలం లీజు మాత్రమే ఉంటుంది. అయినా పూర్తి వివరాలు రెవెన్యూ అధికారిని అడగాలి. – బ్రహ్మయ్య అసిస్టెంట్ కమిషనర్ -
సీమ రైతు ఆవేదనకు అద్దం పట్టిన ‘చినుకుదీవి’
కర్నూలు (కల్చరల్) : ప్రముఖ కవి, రచయిత వెంకటకృష్ణ రచించిన ‘చినుకు దీవి’ కవితా సంకలనం సీమ రైతు ఆవేదనకు అద్దం పట్టిందని ప్రముఖ కవి, విమర్శకుడు రాధేయ తెలిపారు. స్థానిక మద్దూర్‌నగర్‌లోని పింగళిసూరన తెలుగు తోట ప్రాంగణంలో జరిగిన చినుకుదీవి పుస్తక పరిచయ సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. వెంకటకృష్ణ కవిత్వంలో రైతన్నల ఆక్రందనలు, నేతన్నల ఆపసోపాలు, ప్రస్తుత సమాజంలోని వికృత రూపం, మేధావుల, అభ్యుదయ వాదుల, తక్షణ కర్తవ్యం గురించిన సమాలోచన ఉందన్నారు. ఉద్యమ కాంక్ష కలిగిన కవిత్వ దృష్టికి అతడి కవిత్వమే నిజమైన ఉదాహరణ అన్నారు. ప్రముఖ రచయిత పాణి మాట్లాడుతూ భాషను భిన్నంగా ఉపయోగించడమే కవిత్వమన్నారు. మనిషికి, కవిత్వానికి ఒక ప్రాచీన బంధం ఉందన్నారు. భౌతిక ప్రపంచమే ఆత్మిక ప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తుందన్నారు. వెంకటకృష్ణ ‘లోగొంతుక’ దగ్గర నుంచి ‘దున్నే కొద్దీ దుఖం.. హంద్రీగానం.. చినుకుదీవి’ వరకు అణగారిన వర్గాల ఆక్రందనకు బలమైన గొంతుకగా నిలిచారన్నారు. కవిత్వం తనకు చాలా ఇష్టమైన ప్రక్రియ అని పేర్కొంటూనే రచయిత వెంకటకృష్ణ తాను పరిశీలిస్తున్న ప్రతి అంశాన్ని కవిత్వంగా, కథగా మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రముఖ కవి రచయిత జంధ్యాల రఘుబాబు, కవి వెంకటకృష్ణ, నవలా రచయిత ఎస్‌డీవీ హజీజ్, కవి కెంగారమోహన్, సాహితీ వేత్త ఏవీ రెడ్డి పాల్గొన్నారు. -
పుస్తకం.. మానసిక వికాసం
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అంటారు నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం. అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞాన జ్యోతులతో మంచి మార్గం వైపు మళ్లించే పుస్తకాలది ప్రత్యేక స్థానం. జీవిత లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే పుస్తకాన్ని మించిన గురువు లేడని పెద్దలంటారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పుస్తక ప్రదర్శనలో అలాంటి అరుదైన పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. మధుర ‘జ్ఞాపకాలు’ సినిమాలు, టీవీ చానళ్లు..అందులో నటించే నటీనటులంటే దాదాపు అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ నటిస్తూనే గాయకులుగా ప్రసి ద్ధి చెందిన వారి జీవితాల్లోని విశేషాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించే జ్ఞాపకాలలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, సుశీల, జి.వరలక్ష్మి వంటి ఎందరో ప్రస్థానంతో క్రియేటివ్ లింక్ పబ్లికేషన్స్ వారు ‘జ్ఞాపకాలు’ పేరుతో అరుదైన ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. పంచతంత్రం పంచతంత్రం అనగానే ఎవరికైనా బాలల సాహిత్యమే గుర్తుకు వస్తుంది. ముద్రా పబ్లికేషన్ వారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని వారణాసి కలం పేరుతో అభితుకు చలాంబ రచించారు. మిత్ర లాభం, మిత్రభేదం వంటి వాటితో ఆసక్తికరమైన కథలు, కష్టకాలంలో ప్రదర్శించాల్సిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను తెలియచెప్పే ఈ పుస్తకం చిన్నారుల మానసిక వికాసానికి ‘చినుకు దీవి’ ఆవిష్కరణ రచయితగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకున్న వెంకటకృష్ణ కవితా శైలి వినూత్నమని ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి అన్నారు. అనంతపురంలోని ఆర్ట్స్‌కళాశాల మైదానంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో భాగంగా గురువారం రాత్రి వెంకట కృష్ణ రచించిన ‘చినుకు దీవి’ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని సాహితీ విమర్శకులు డాక్టర్ రాధేయకు అందించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు బండి నారాయణస్వామి, జూపల్లి ప్రేమచంద్, రియాజ్, పుస్తక ప్రదర్శన సమన్వయ కర్త అనంత్ పాల్గొన్నారు. -
ఉసురుతీసిన అతివేగం!
అనంతపల్లి(నల్లజర్లరూరల్) : అతివేగం మూడు ప్రాణాలను బలిగొంది. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా వాసులే. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కటికాల శ్రీనివాసరావు(46), అదే మండలం ముత్యాలమ్మపాడుకు చెందిన మద్దినేని వెంకటకృష్ణ(28), గురజాల మండలం పులిపాడుకు చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు(38) విశాఖ జిల్లా పరవాడ సమీపంలోని దిబ్బలగొర్లవానిపాలెంలో ఒక పెట్రోల్ బంకు లీజు వ్యవహారంపై ఆదివారం రాత్రి ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తుండగా, నల్లజర్ల మండలం అనంతపల్లి శివారున ఎదురుగా కూల్‌డ్రింక్స్ లోడుతో వెళ్తున్న మినీలారీ డ్రైవర్ నల్లజర్ల మండలం నబీపేట వెళ్లడానికి మలుపు తిరగాల్సి రావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ సమయంలో వెనుక వస్తున్న కారు మినీలారీని ఢీకొని ఆగింది. ఇంతలో వెనుక వేగంగా వచ్చిన తమిళనాడుకు చెందిన లారీ కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న కటికాల శ్రీనివాసరావు, అదే మండలం ముత్యాలమ్మపాడుకు చెందిన మద్దినేని వెంకటకృష్ణ, గురజాల మండలం పులిపాడుకు చెందిన ప్రత్తిపాటి శ్రీనివాసరావు దుర్మరణం పాలయ్యారు. కారు డ్రైవర్ బాషానాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతం రక్తసిక్తమైంది. మృతదేహాలు కారు శకలాల్లో ఇరుక్కుపోయాయి. భయానక వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. విషయం తెలియగానే అనంతపల్లి ఎస్ఐ నాయక్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గడ్డపలుగులతో కారు శకలాలను తొలగించి అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. తాడేపల్లిగూడెం సీఐ జి.మధుబాబు, కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తాడేపల్లిగూడెం ఆస్పత్రిలో హాహాకారాలు పెంటపాడు : ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురినీ పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం ఆస్పత్రి సూపరింటెండెంట్ వసంతం జనార్దన్ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదం గురించి తెలియగానే గుంటూరు జిల్లా నుంచి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు 30 కార్లలో ఆస్పత్రికి చేరారు. వారి హాహాకారాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. నల్లజర్ల మండలం అచ్చెనపాలెం గ్రామసర్పంచ్ బి.వెంకటసుబ్రమణ్యచౌదరి, అనంతపల్లికి చెందిన పలువురు ఏరియా ఆస్పత్రి వద్ద మృతుల బంధువులకు సహాయసహకారాలు అందించారు. -
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
తల్లిబిడ్డల హత్యకేసులో వీడిన మిస్టరీ నిందితుడి అరెస్టు రేపల్లె: నియోజకవర్గ పరిధిలోని నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో సెప్టెంబర్ 25తేదీన జరిగిన తల్లిబిడ్డల హత్యకేసులో మిస్టరీ వీడింది. హత్య చేసింది కట్టుకున్న వాడేనని పోలీసులు నిర్ధారించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో రూరల్ సీఐ పెంచలరెడ్డి శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగరం మండలం చిలకాలవారిపాలెం గ్రామంలో ఉప్పాల శివరామకృష్ణ అలియాస్ వెంకట కృష్ణ భార్య తిరుపతమ్మ కాపురం ఉంటున్నారు. గత కొంత కాలంగా తిరుపతమ్మ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం పెనుభూతంగా మారింది. శివరామకృష్ణ ప్రతి రోజు తెనాలిలో తాపీపని చేసి తిరిగి ఇంటికి వస్తుంటాడు. అదేవిధంగా సెప్టెంబర్ 25వతేదీ రాత్రి ఇంటికి వచ్చిన శివరామకృష్ణకు ఆయన భార్య తిరుపతమ్మకు మధ్య వివాహేతర సంబంధంపై వివాదం తలెత్తింది. ఈక్రమంలో భార్య తిరుపతమ్మపై కత్తితో దాడిచేయగా అడ్డం వచ్చిన కుమార్తె నాగశ్రీ, కుమారుడు యశ్వంత్లకు తీవ్రగాయాలై అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. గమనించిన శివరామకృష్ణ కుమార్తె మృతదేహాన్ని ఇంటి వెనుక ఉన్న తాడిదిబ్బలో పాతిపెట్టి కుమారుని శవాన్ని పక్కనే ఉన్న కాల్వలో పడవేసి పరాయ్యాడు. కేసును అన్ని కోణాలలో విచారించటం జరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో శివరామకృష్ణ శుక్రవారం ఉదయం ఏలేటిపాలెం వీఆర్వో కర్రా రవి వద్ద లొంగిపోయి విషయాన్ని చెప్పి తమ వద్ద లొంగిపోయినట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని గ్రామస్థుల సమక్షంలో కాల్వలో నుంచి తమకు స్వాధీనం చేసినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు.