సాక్షి, అమరావతి: సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి చానల్ పాత్రికేయుడు పర్వతనేని వెంకటకృష్ణను సీఐడీ అధికారులు రెండు రోజులపాటు విచారించారు. వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి సమాజంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రపన్నారనే అభియోగాలపై కొన్ని నెలల కిందట నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్–ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్లపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల టీవీ 5 మూర్తిని సీఐడీ అధికారులు విచారించారు. అదే కేసులో ఏబీఎన్–ఆంధ్రజ్యోతి చానల్ పాత్రికేయుడు వెంకటకృష్ణను సీఐడీ అధికారులు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం, మంగళవారం దాదాపు 15 గంటలపాటు విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment