పుస్తకం.. మానసిక వికాసం
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అంటారు నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం. అజ్ఞానాంధకారం నుంచి విజ్ఞాన జ్యోతులతో మంచి మార్గం వైపు మళ్లించే పుస్తకాలది ప్రత్యేక స్థానం. జీవిత లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే పుస్తకాన్ని మించిన గురువు లేడని పెద్దలంటారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పుస్తక ప్రదర్శనలో అలాంటి అరుదైన పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి.
మధుర ‘జ్ఞాపకాలు’
సినిమాలు, టీవీ చానళ్లు..అందులో నటించే నటీనటులంటే దాదాపు అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ నటిస్తూనే గాయకులుగా ప్రసి ద్ధి చెందిన వారి జీవితాల్లోని విశేషాలను కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించే జ్ఞాపకాలలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, సుశీల, జి.వరలక్ష్మి వంటి ఎందరో ప్రస్థానంతో క్రియేటివ్ లింక్ పబ్లికేషన్స్ వారు ‘జ్ఞాపకాలు’ పేరుతో అరుదైన ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు.
పంచతంత్రం
పంచతంత్రం అనగానే ఎవరికైనా బాలల సాహిత్యమే గుర్తుకు వస్తుంది. ముద్రా పబ్లికేషన్ వారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని వారణాసి కలం పేరుతో అభితుకు చలాంబ రచించారు. మిత్ర లాభం, మిత్రభేదం వంటి వాటితో ఆసక్తికరమైన కథలు, కష్టకాలంలో ప్రదర్శించాల్సిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను తెలియచెప్పే ఈ పుస్తకం చిన్నారుల మానసిక వికాసానికి
‘చినుకు దీవి’ ఆవిష్కరణ
రచయితగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకున్న వెంకటకృష్ణ కవితా శైలి వినూత్నమని ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి అన్నారు. అనంతపురంలోని ఆర్ట్స్‌కళాశాల మైదానంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో భాగంగా గురువారం రాత్రి వెంకట కృష్ణ రచించిన ‘చినుకు దీవి’ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని సాహితీ విమర్శకులు డాక్టర్ రాధేయకు అందించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు బండి నారాయణస్వామి, జూపల్లి ప్రేమచంద్, రియాజ్, పుస్తక ప్రదర్శన సమన్వయ కర్త అనంత్ పాల్గొన్నారు.