నా వెనుక దేవుడున్నాడు | RGV's Officer Movie Trailer | Sakshi
Sakshi News home page

నా వెనుక దేవుడున్నాడు

Published Sun, May 13 2018 1:10 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

RGV's Officer Movie Trailer  - Sakshi

► ముందుగా ‘ఆఫీసర్‌’ గురించి నాలుగు మాటలు? నాగార్జునతో మళ్లీ ఎందుకు సినిమా తీయాలి అని అనుకున్నారు?
రామ్‌గోపాల్‌వర్మ: హీరోయిజమ్‌తో నేను సినిమా తీసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ‘ఆఫీసర్‌’ కథ రాయగానే నాగార్జున గారే మైండ్‌లోకి వచ్చారు. అతన్నే అప్రోచ్‌ అయ్యాను.

► ఈ మధ్య కాలంలో వచ్చిన మీ సినిమాలన్నీ వచ్చినట్టు వెళ్లిపోతున్నాయి. మరి ఆఫీసర్‌ సక్సెస్‌ అవుతాడా?
‘ఆఫీసర్‌’ ఆడియన్స్‌కు ఎంత నచ్చుతుందన్న విషయం మీద డిపెండ్‌ అవుతుంది.

► మీ నుంచి మళ్లీ›‘శివ, గోవిందా గోవిందా, క్షణక్షణం’ లాంటి సాలిడ్‌ హిట్‌ మూవీస్‌ కోసం ఆడియన్స్‌ ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు ‘ఆఫీసర్‌’ సరైన సమాధానం చెబుతాడా?
      పైన సమాధానం మళ్లీ చదవండి.

► అఖిల్‌తో మూవీ అనౌన్స్‌ చేశారు. దాని స్టేటస్‌ ఏంటి?
2 నెల్లలో స్టార్ట్‌ అవుతుంది.

► మీరు గమనించారో లేదో  ఒకప్పుడు మీ సినిమాలు కంటెంట్‌ చుట్టూ తిరిగేవి. ఇప్పుడు కంటెంట్‌ ఓరియంటెడ్‌గా ఉన్నప్పటికీ సెన్సేషన్‌ చుట్టూ తిరిగుతునట్టుగా అనిపిస్తుంది?
ఏ కళ్లు పెట్టుకొని చూస్తే ఆ కళ్లకి కనిపించేలా కనిపిస్తుంది.

► మీరు అనౌన్స్‌ చేసిన సినిమాలు 10 వరకూ ఉన్నాయి. వాటి స్టేటస్‌ ఏంటి?
అన్నీ వాటి వాటి టైమ్‌ వచ్చినప్పుడు వస్తాయి.

► ఎవరికైనా కాంట్రవర్శీల కన్నా స్మూత్‌గా లైఫ్‌ వెళ్లిపోతే బావుండు అనుకుంటారు. మీరేమో కాంట్రవర్శీలే కావాలి అంటారు. అందులో ఆనందం ఉందా మీకు?
చిన్నప్పటి నుంచి.

► ఎవరి మీద పడితే వాళ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునే దమ్ము మీకుంది. ఏంటి మీ ధైర్యం? మాఫియా అండ ఉంది అన్నది కొందరి అభిప్రాయం.
నా వెనుక దేవుడున్నాడు.

► మీకు బొత్తిగా ఉమెన్‌ అంటే రెస్పెక్ట్‌ లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు వాళ్ల గురించి ట్వీట్‌ చేసిన వాళ్ల శరీరం గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏ ‘ఉమెన్‌’ అంటే మీ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సెక్సువల్‌ ఆబ్జెక్టా?
నా దృష్టిలో సృష్టి సృష్టించిన ఒకే ఒక్క అద్భుతం ఉమెన్‌.

రీసెంట్‌ శ్రీ రెడ్డి కాంట్రవర్శీలో పవన్‌ కల్యాణ్‌ని తిట్టమని మీరే అన్నారని ఆమె చెప్పారు. ఎవరినైనా సరే తిట్టే దమ్మున మీరు శ్రీ రెడ్డిని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు ?అసలేంటి శ్రీ రెడ్డికీ మీకు ఉన్న సంబంధం ?ఒకవేళ శ్రీ రెడ్డిని మీరు సపోర్ట్‌ చేయకుండా అమెను క్రిటిసైజ్‌ చేస్తే మీ గురించి బైటపెట్ట తగ్గ వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయా?ఈ టోటల్‌ శ్రీ రెడ్డి ఇష్యూలో పొలిటికల్‌ పార్టీల ఇన్వాల్వ్‌మెంట్‌ ఉందని చాలా మంది అభిప్రాయం. నిజమా?
దీనికి సంబంధించిన నా వివరణ యూట్యూబ్‌లో ఉంది. ఇంట్రెస్ట్‌ ఉన్నవాళ్లు చూసుకోవచ్చు.

మీరు మనుషుల్ని వదిలిపెట్టరు. ఆ మాటకొస్తే దేవుడ్ని కూడా వదిలిపెట్టరు. భయం, భక్తి అనేవి మీ వంటికి తెలియదా? లైఫ్‌లో ఎన్నో మాట్లాడకూడని విషయాలు మాట్లాడారు. ఎప్పుడైనా ఈ మాట మాట్లాడి ఉండకూడదు అని రిగ్రెట్‌ ఫీల్‌ అయ్యారా?
నేనెప్పుడూ రిగ్రెట్‌ ఫీల్‌ అవ్వను. ముందుకు వెళ్లిపోతూ ఉంటా.

‘గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ అప్పుడు ‘ఆన్‌ ఎర్త్‌ దేరీజ్‌ నో లొకెషన్‌ విచ్‌ ఈజ్‌ మోర్‌ బ్యూటిఫుల్‌ దాన్‌ ఉమెన్‌ బాడీ’ అన్నారు.
అవును. నేనా విషయాన్ని నమ్ముతాను.

పవన్‌ కల్యాణ్‌ మీద మీరు చేపించిన కామెంట్స్‌కి పూరీ ఫీల్‌ అయ్యారు? దానికి మీరెమంటారు?
అనటం నా హక్కు. ఫీల్‌ అవ్వడం తన హక్కు.

ఫైనల్లీ వర్మ అద్భుతమైన టెక్నీషియన్‌. అది ఎవరూ కాదనలేని విషయం. కాకపోతే మీరు తీసిన సినిమాల వల్ల మాట్లాడే మాటల వల్ల‘ సైకో’ అని మీకు ‘పర్వెర్ట్‌’ అని చాలా మంది అంటారు. దాని గురించి మీరెంమంటారు?
నేను చెప్పేవి, చేసేవి అర్థం చేసుకోలేని వాళ్ల అభిప్రాయాల గురించి నేను పట్టించుకోను.

‘వర్మ పని అయిపోయింది’ అనే వాళ్లకు మీ సమాధానం ఏంటి?
ఆఫీసర్‌.

‘ఆఫీసర్‌’ ట్రైలర్‌కు నెగటీవ్‌ ఫీడ్‌బ్యాక్‌ వస్తుంది. దాని గురించి ఏమంటారు?
పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ని అడగండి.

రీసెంట్‌ టైమ్‌లో మీకు సాలిడ్‌ సక్సెస్‌ లేదు. కోట్లు కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకునట్టుగా కూడా అనిపించదు. మీ ఫైనాన్షియల్‌ స్టేటస్‌ ఏంటి? మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి?
నాకు సరిపడినన్ని.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement