ఆఫీస్‌ ముగిసింది | Ram Gopal Varma wraps up Nagrajuna's cop drama, 'Officer' | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ ముగిసింది

Published Sun, Apr 29 2018 12:13 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

Ram Gopal Varma wraps up Nagrajuna's cop drama, 'Officer' - Sakshi

అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మది హిట్‌ కాంబినేషన్‌. వీరి కలయికలో వచ్చిన ‘శివ’ సినిమా ఎంత ట్రెండ్‌ సెట్‌ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా వీరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఆఫీసర్‌’ సినిమా షూటింగ్‌ శనివారం ముగిసింది. ‘‘ఆఫీసర్‌ సినిమాలోని లాస్ట్‌ షాట్‌ చిత్రీకరణ ముగిసింది’’ అని వర్మ తెలిపారు. కంపెనీ పతాకంపై వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో మైరా సరీన్‌ కథానాయిక.

ఇందులో నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం ఆయన హైదరాబాద్‌ నుంచి ముంబైకి స్పెషల్‌ ఆఫీసర్‌గా వెళ్తారట. ముంబై నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటికే టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మే నెలలో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement