
నాగార్జున
ఇప్పటివరకూ ఆఫీసర్ ఎలా ఉంటాడో మాత్రమే తెలుసు. కానీ అతను డ్యూటీలో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, ఎంత నిబద్ధతగా నడుచుకుంటాడో, క్రిమినల్స్ అంతు ఎలా తేలుస్తాడో తెలీదు. రేపు ఆఫీసర్ డ్యూటీ చేయడాన్ని చిన్న శాంపిల్ చూపిస్తాం అంటున్నారు ‘ఆఫీసర్’ టీమ్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘ఆఫీసర్’. కంపెనీ పతాకంపై సుధీర్ చంద్ర, రామ్‌గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. మైరా సరీన్ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు.
శనివారం రామ్‌గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు. ‘‘నా ప్రెస్టీజియస్ మూవీ ‘ఆఫీసర్’ టీజర్‌ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నాను. నాగ్.. నాకు బర్త్‌డే విషెస్ అంటే పెద్దగా నచ్చదు. బట్ ప్లీజ్ మీరు విష్ చేయండి’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు వర్మ. దానికి నాగార్జున ‘‘ హే వర్మ. విషింగ్ యూ ఏ వెరీ వెరీ... ఎంజాయ్ ది డే. ఎలాగూ నువ్వు చేస్తావనుకో’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment