హైదరాబాద్ నుంచి వచ్చి ముంబైలో మనల్ని పీకుతాడా! | Nagarjuna Ram Gopal Varma Officer Teaser | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 10:07 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna Ram Gopal Varma Officer Teaser - Sakshi

ఆఫీసర్‌ సినిమాలో నాగార్జున

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సీనియర్‌ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆఫీసర్‌. చాలా కాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్న వర్మ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నాగార్జున కూడా ఈ సినిమా సక్సెస్‌మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. వర్మ చెప్పిన కథ నచ్చటంతో ట్రాక్‌ రికార్డ్‌ను పట్టించుకోకుండా సినిమా అంగీకరించాడు నాగ్‌.

మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఇటీవల ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈ రోజు(సోమవారం) టీజర్‌ ను రిలీజ్ చేశారు. చాలా రోజులు తరువాత నాగార్జునను ఓ సీరియస్‌ రోల్‌లో చూపించాడు దర్శకుడు. వర్మ మార్క్‌ యాక్షన్ సీన్స్‌, కెమెరా వర్క్‌తో ఆఫీసర్‌ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. మరి ఈ సినిమా అయినా వర్మకు సక్సెస్‌ ఇస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement