
వివాదాల వర్మ తాజాగా తెరకెక్కించిన సినిమా ఆఫీసర్. చాలా ఏళ్ల తర్వాత కింగ్ నాగార్జునతో కలిసి సినిమా చేస్తున్నారు వర్మ. ఇటీవల ఎక్కువగా వివాదాలతో సహవాసం చేస్తున్న వర్మకు గత కొన్నేళ్లుగా విజయాలు లేవు. ఇలాంటి సమయంలో నాగ్‌తో సినిమా.. అనేసరికి అంచనాలు అమాంతం పెరిగాయి. దానికి తగ్గట్లే... ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. వర్మ టేకింగ్ స్టైల్ అందులో స్పష్టంగా కనబడుతూనే ఉంది. మళ్లీ రెండో టీజర్‌ను కూడా రెడీ చేశారు ఆఫీసర్ టీం.
‘ఆఫీసర్’ రెండో టీజర్‌ను రేపు ( మే 4) సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ ట్విటర్‌లో తెలిపారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో, పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని మొదటి టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసర్ షూటింగ్ పూర్తైయింది. మరి ఈ సినిమా గతంలోలా ట్రెండ్‌సెట్ చేస్తుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment