
సాక్షి, సినిమా : నటి రాధికాఆప్తే అంటే సంచలనానికి మారుపేరు అంటారు. సినిమాలతోనే జీవిస్తున్న ఈమె సినిమా వాళ్లపై తరచూ మాటాల తూటాలు పేల్చుతుంటారు. సెక్సీ పోజులతో దర్శనం ఇవ్వడం, వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించడం రాధికాఆప్తే నైజం. ఈ మధ్య గోవా సముద్ర తీరంలో బాయ్‌ఫ్రెండ్‌తో అర్ధనగ్నంగా కనిపించి వార్తల్లోకెక్కింది. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ అమ్మడిని రక్తచరిత్ర చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఆ తరువాత ధోని చిత్రంతో కోలీవుడ్‌కు వచ్చింది. కబాలి చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించి పాపులారిటీని తెచ్చుకుంది.
కాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. తనకు ఏం అనిపిస్తే అది అనేసి తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. అలాంటిది తనను నటిగా పరిచయం చేసిన ఆయనకే రాధికాఆప్తే షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ అమ్మడు ఇప్పుడున్న నటులు, దర్శకుల్లో ఎవరు రిటైర్మెంట్ తీసుకోవాలని అంటారు అన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అని టక్కున బదులిచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రాధికాఆప్తే వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.