హారర్‌ మూవీ:అమ్మఆత్మ..మోదీ భూతవైద్యుడు | Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now? | Sakshi
Sakshi News home page

హారర్‌ మూవీ:అమ్మఆత్మ..మోదీ భూతవైద్యుడు

Published Wed, Feb 8 2017 8:54 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM

హారర్‌ మూవీ:అమ్మఆత్మ..మోదీ భూతవైద్యుడు - Sakshi

హారర్‌ మూవీ:అమ్మఆత్మ..మోదీ భూతవైద్యుడు

తమిళనాట నిమిష నిమిషానికి మారుతున్న ఉత‍్కంఠ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌​ వర్మ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు.

చెన్నై: తమిళనాట నిమిష నిమిషానికి మారుతున్న ఉత‍్కంఠ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌​ వర్మ  సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. సౌమ్యుడుగా, పార్టీకి వీరవిధేయుడుగా వుంటూ వచ్చిన  తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ మంగళవారం తిరుగుబాటుపై ట్విట్టర్‌ ద్వారా వర్మ స్పందించారు.  పన్నీర్ ధిక్కారం వెనక మోదీ సర్కారు వ్యూహం​ ఉంది.. మోదీ అండతోనే పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు చెలరేగుతుండగానే..వర్మ  ట్విట్టర్‌ ద్వారా మరో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు

 జయ సమాధి సాక్షిగా  పురుచ్చిత్తలైవి ఆత్మ తనతోమాట్లాడిందనీ,  రాష్త్ర ముఖ్యమంత్రిగా ఉండమని ఆదేశించిందన్న పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యలపై వర్మ తనదైన  శైలిలో స్పందించారు. తమిళనాట రాజకీయాలు రాజకీయ హారర్‌ మూవీని తలపిస్తున్నాయన్నారు. అమ్మ ఆత్మ పన్నీర్‌ సెల్వం రాష్ట్ర ముఖ​మంత్రిగా ఉండాలని  ఆదేశిస్తే.... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూత వైద్యుడు కానున్నారా  అంటూ ట్వీట్‌ చేశారు.  
కాగా పన్నీర్‌ సెల్వం  ఎగరవేసిన తిరుగుబాటు జెండా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశం​మొత్తం  తమిళరాజకీయ పరిణామాలవైపు  చూస్తోంది. అటు  ముఖ్యమంత్రి పీఠంపై చిరకాలంగా కన్నేసిన శశికళ...తాజా భంగపాటుతో  తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పన్నీర్‌ సెల్వంను  చెక్‌ పెట్టే  పనిలో బిజీగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే..  నా  ఆత్మ  క్షోభిస్తోంది.. అంటూ నిన్న సాయంతం సెల్వం పేల్చిన బాంబులు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.   ఆయనకు భారీ మద్దతు లభిస్తోంది. అటు శశికళకూడా  సెల్వం డీఎంకేతో కుమ‍్మక్కయ్యారని  ఆరోపిస్తున్నారు. మరి.. రానున్న కాలంలో తమిళనాట రాజకీయ పరిణామాలు ఎలా పరిణమించనున్నాయో.. వేచి చూడాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement