సాక్షి, లక్నో : ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని 10 లక్షల పై చీలూకు మెజార్టీ ఓట్లతో గెలిపించాలని బీజేపీ పిలుపు నిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న మోదీ తరుపున బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ‘ఆప్‌కి బార్ 10 లాక్స్ పార్’ ఎన్నికల నినాదంతో మోదీని 10లక్షలకు పై మెజార్టీతో గెలిపించాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ‘ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో ఓట్లు పోలయ్యేలా ప్రచారం చేస్తున్నాం. ఆప్‌కి బార్ 10 ల్యాక్స్ పార్ అనే నినాదంతో కార్యకర్తలు మోదీకి అండగా నిలుస్తున్నారని వారణాసి నగర బీజేపీ అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ తెలిపారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో
ప్రధాని మోదీ నాటి 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రం వడోదరా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మోదీకి దాదాపు 581,000 ఓట్లు పోలయ్యాయి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పోలింగ్ శాతం 7.25 శాతం పెరిగింది. మొత్తం 64 శాతంతో మోదీ దాదాపు 675,000 ఓట్లను సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4,80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2009లో బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు, నవ్‌సారి నియోజక వర్గం ఎంపీ సీఆర్ పాటిల్ దాదాపు 973,000 ఓట్లను పొందారు. అత్యధికంగా 689,000 ఓట్ల తేడాతో లోక్ సభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించారు
10లక్షలకు పైన ఓట్లు సాధించేలా
2024లోక్ సభ ఎన్నికల్లో 10 లక్షల పైన ఓట్లను సాధించేలా క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలో మార్చి 31 న కార్మికుల ‘టిఫిన్ మీట్’ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన విద్యాసాగర్ రాయ్ కార్మికులకు మార్గనిర్దేశం చేయడానికి పీఎం మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment