
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. పవన్ తొలిసారిగా ప్రగతి భవన్‌కు రావటం, సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. గతంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగిన ఈ ఇద్దరు ఇలా భేటి కావడం.. కేసీఆర్ పాలనపై పవన్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ భేటిపై తనదైన శైలిలో స్పందించారు. అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చెస్తుందని ఫేస్‌బుక్ వేదికగా సెటైర్ వేశారు.
వర్మ పోస్ట్ ఏమిటంటే..
పవన్ కల్యాణ్: ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా..!!!
కేసీఆర్: ఆడి పేరేందిరా బై.. ???
అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది. జై రాజకీయ నాయకుల్లారా! అని కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోకి క్యాప్షన్‌గా పోస్ట్ చేశారు.