అప్పుడు నారాయణ అనేస్తా! | Ram Gopal Varma interview about Bhairava Geetha | Sakshi
Sakshi News home page

అప్పుడు నారాయణ అనేస్తా!

Published Tue, Nov 27 2018 4:19 AM | Last Updated on Tue, Nov 27 2018 4:19 AM

Ram Gopal Varma interview about Bhairava Geetha - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ

‘‘ప్రతి సినిమాను ఒకే రకమైన ష్యాషన్‌తో తీస్తాను. ఆడితే ఒళ్లు దగ్గరపెట్టుకుని తీశాడంటారు. ఆడకపోతే రివర్స్‌లో మాట్లాడతారు. ఫిల్మ్‌ మేకింగ్‌లో తెలిసి తప్పులు చేయను. ఏ దర్శకులూ కావాలని తప్పులు చేయరు’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ధనుంజయ్, ఐరా మోర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో అభిషేక్‌ నామా, భాస్కర్‌ రాశి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజవుతోంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ చెప్పిన విశేషాలు...

► ‘భైరవగీత’ చిత్రాన్ని భుజాన వేసుకోలేదు. అ«ధఃపాతాళంలోకి కూరుకుపోయిన నన్ను ఓ చేయి ఇచ్చి పైకి లాగుతుందనుకుంటున్నాను. ఒక సినిమా కథ వల్ల ఆడొచ్చు లేదా స్టార్‌డమ్‌ వల్ల ఆడొచ్చు. కానీ ఒక డైరెక్టర్‌ సీన్‌ను చెప్పే విధానంలో ఉండే మార్పే నా దృష్టిలో సినిమాటిక్‌ లాంగ్వేజ్‌.  ఆ లాంగ్వేజ్‌ అరుదుగా మారుతుంటుంది. దీన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను సిద్ధార్థ్‌ దర్శకత్వంలో చూశాను.

►నా దగ్గర నుంచి 30–40మంది డైరెక్టర్లు వచ్చి ఉంటారు. నా వర్కింగ్‌ స్టైల్‌ ఇన్‌ప్లూయెన్స్‌తో సిద్ధార్థ్‌ నా దగ్గరకు వచ్చాడు. అందుకే రిలీజ్‌ చేసిన ట్రైలర్, సాంగ్స్‌లో నా మార్క్‌ కనిపించి ఉండొచ్చు. సినిమాలో సిద్ధార్థ్‌ స్టైల్‌ తెలుస్తుంది. లోయర్‌ స్టేటస్‌ ఉన్న వ్యక్తి, హయ్యర్‌ స్టేటస్‌ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. దానివల్ల ఎలాంటి రెబలిజమ్‌ మొదలైంది? అనేది ఈ చిత్రకథ.

►వంశీ అనే అతను ఈ సినిమా స్క్రిప్ట్‌ రాశాడు. ఆ తర్వాత మేం మార్పులు చేశాం. ఈ స్క్రిప్ట్‌ను íసిద్ధార్థ్‌ డైరెక్ట్‌ చేస్తే బాగుండు అనిపించింది. సిద్ధార్థ్‌ను శిష్యుడుగా అనుకోవడం లేదు. ఎప్పుడెప్పుడు నా నుంచి బయటపడాలా అని చూస్తున్నాడు. సినిమా ఆడితే.... రామ్‌గోపాల్‌ వర్మ ఎవరు? అని సిద్ధార్థ్‌ అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ‘2.ఓ’ సినిమాను పిల్లలు చూసే సినిమా అనడానికి కారణం ‘భైరవగీత’ పబ్లిసిటీ కోసమే.

►కావాలని తప్పులు చేయం.  సినిమా బాగా ఆడకపోవడానికి ఒక్కరే కారణం అవ్వరు. నాలుగైదు కారణాలు ఉంటాయి. ‘ఆఫీసర్‌’ చిత్రం బ్యాడ్‌గా ఉందని తెలిస్తే రిలీజ్‌ కూడా చేయం కదా. నాగార్జున, నేను ఇద్దరూ నమ్మి ‘ఆఫీసర్‌’ సినిమా చేశాం. అందుకే రిలీజ్‌ తర్వాత ఈ సినిమా గురించి హీట్‌ డిస్కషన్‌ లేదు.
►నేను దేవుణ్ణి నమ్మనని ఎప్పుడూ చెప్పలేదు. భక్తులను నమ్మననే చెప్పాను. నేను దేవుణ్ణి నమ్మితే చాలా పాపాలు చేయలేను. నాకు తోచినవన్నీ చేసేసి చనిపోయే 5 నిమిషాల ముందు నారాయణ అనేస్తా. నేను డైరెక్టర్‌నే కాదు యాక్టర్‌ని కూడా.

►ఎన్టీఆర్‌గారి జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతి సంఘటనలే కీలకంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ తీస్తున్నాను. ఇందులో కొత్తగా తెలియనిది చెప్పడం లేదు. బాలకృష్ణగారి ‘యన్‌.టీ.ఆర్‌’  బయోపిక్‌ సబ్జెక్ట్‌కు, నా సబ్జెక్ట్‌కు కనెక్షన్‌ లేదు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలో చంద్రబాబునాయుడుగారి పాత్ర ఎలా ఉంటుంది? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా పరంగా నా ఇంట్రెస్ట్‌నే శాటిస్‌ఫై చేస్తాను. స్క్రిప్ట్‌ చూపించనని లక్ష్మీపార్వతిగారికి చెప్పాను. నమ్మకం ఉంటేనే అనుమతి ఇవ్వమని కోరాను. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. జనవరి ఎండింగ్‌ లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తాం. ‘యన్‌.టీ.ఆర్‌’ బయోపిక్, వైఎస్సార్‌ ‘యాత్ర’ సినిమాల టైమ్‌లోనే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ రిలీజవుతుందంటే అది కాకతాళీయమే.

►రామ్‌ ఇలాంటోడు అలాంటోడు అన్నారు. నేను తప్ప అందరూ ‘మీటూ’లో ఉన్నారు బాలీవుడ్‌లో. వచ్చిన వార్ల పేర్లు విని షాక్‌ అయ్యాను.

►ఓటు ప్రాముఖ్యత గురించి నా చిన్నప్పుడు నేనూ విన్నాను. ఇప్పటివరకు నా లైఫ్‌లో ఓటు వేయలేదు. పాలిటిక్స్‌ను అర్థం చేసుకునే టైమ్‌ నాకు లేదు. నాకు ఎవ్వరు ఉన్నా ఓకే. చట్టానికి లోబడి ఉంటాను కాబట్టి ప్రభుత్వాలు చట్టాన్ని మార్చితే ఆ మార్పులను ఫాలో అవుతాను. నాకు ఆసక్తి ఉన్న పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్‌ చూపిస్తాను. నాకు అమెరికన్‌ పాలిటిక్స్‌ అంటే ఇష్టం. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ గెలుస్తాడని ఇండియాలో ముందు చెప్పింది నేనే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement