
వర్మతో సినిమా చేస్తానన్న సూపర్ స్టార్
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో స్టార్ హీరో కాదు కదా.. కొత్త హీరోలు
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో స్టార్ హీరో కాదు కదా.. కొత్త హీరోలు కూడా వర్మ సినిమా అంటే బయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో వర్మ సినిమా స్థాయి దారుణంగా పడిపోయింది. ఈ గ్యాప్ లో ఒక్క అమితాబ్ తప్ప మరే స్టార్ హీరో కూడా వర్మతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు.
అయితే ఈ పరిస్థితుల్లో కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో సత్తా చాటుతున్న మోహన్ లాల్ బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కంపెనీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన లాల్, మరోసారి వర్మతో సినిమా చేయడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు.