మనసు దోచావ్‌ అన్నారు! | Sarkar-3 movie story | Sakshi
Sakshi News home page

మనసు దోచావ్‌ అన్నారు!

Published Thu, May 11 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

మనసు దోచావ్‌ అన్నారు!

మనసు దోచావ్‌ అన్నారు!

సర్కార్‌... ఓ బ్రాండ్‌. అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీసిన ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’ సినిమాలు సూపర్‌ హిట్‌. ఈ బ్రాండ్‌లో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో సినిమా ‘సర్కార్‌–3’కి కథ, స్క్రీన్‌ప్లే అందించింది పాతికేళ్ల తెలుగబ్బాయి పి. జయ కుమార్‌. ఊరు కడప జిల్లాలోని రైల్వే కోడూరు. సినిమాలపై పిచ్చితో ఢిల్లీ జేఎన్‌యూలో ఎం.ఎ. ఫిల్మ్స్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ డుమ్మా కొట్టి వర్మ దగ్గర చేరిన జయకుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘వర్మగారి దగ్గర రెండున్నరేళ్లు గా పని చేస్తున్నా.

‘సర్కార్‌–3’ కోసం ఆయన కథలు పరిశీలిస్తున్నప్పుడు నేనీ కథ చెప్పగానే ‘మేం వెధవలమనుకుంటున్నావా?’ అన్నారు. ‘ఎందుకు సార్‌!’ అన్నా. ‘అలా ఫీలైనోడే ఇలాంటి కథ రాయగలడు’ అన్నారు. కథ ఆయనకు నచ్చడంతో ‘సర్కార్‌–3’ స్టార్ట్‌ చేశారు. ‘క్లైమాక్స్‌తో నువ్వు నా మనసు దోచావ్‌’ అని అమితాబ్‌గారు మెచ్చుకున్నారు. అమితాబ్‌–వర్మ సినిమాతో రచయితగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement