తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు | Ram Gopal Varma announces KCR biopic titled Tiger | Sakshi
Sakshi News home page

తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు

Apr 19 2019 12:35 AM | Updated on Apr 19 2019 8:00 AM

Ram Gopal Varma announces KCR biopic titled Tiger - Sakshi

సంచలనానికి కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌గోపాల్‌ వర్మ. తీసే సినిమా, చేసే ట్వీట్, మాట్లాడే మాట... ఇలా ఆయన ఏం చేసినా సెన్సేషనే. ‘రక్తచరిత్ర’, ‘వంగవీటి’, లేటెస్ట్‌గా ‘లక్ష్మీస్‌: ఎన్టీఆర్‌’ సినిమాతో రియలిస్టిక్‌ స్టోరీస్‌ చెప్పడంలో వర్మ ది బెస్ట్‌ అని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు. ఇటీవల ఓ రౌడీషీటర్‌ బయోపిక్‌ (కోబ్రా) ద్వారా ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ‘కేసీఆర్‌’ బయోపిక్‌ను అనౌన్స్‌ చేశారు వర్మ. ‘టైగర్‌ కేసీఆర్‌: ది అగ్రెసివ్‌ గాంధీ’ అనేది టైటిల్‌. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనేది ట్యాగ్‌లైన్‌.

టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసి, వర్మ ట్వీటర్‌లో – ‘‘ఆంధ్రా వాళ్లు తెలంగాణ వాళ్లను థర్డ్‌ క్లాస్‌గా ట్రీట్‌ చేయడం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. పక్క రాష్ట్రంలోని నాయకుల్లా కాకుండా కేసీఆర్, వైఎస్‌ఆర్‌ మాత్రమే వాళ్ల పిల్లలను వాళ్లలాంటి నాయకులుగా తయారుచేయగలిగారు. ట్యాగ్‌లైన్‌లో ‘ఆడు’ అనే పదాన్ని ప్రాబ్లమ్‌గా భావిస్తున్న వాళ్లకు కేసీఆర్‌ ఏం సాధించకముందు అతన్ని చిన్నచూపు చూసినవాళ్ల కోణంలోంచి పెట్టాను. కేసీఆర్, కేటీఆర్‌ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement