
ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై
జగద్గిరి గుట్ట: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై బాచుపల్లిలోని కౌసల్యకాలనీకి చెందిన తెలుగుదేశం అభిమాని దేవీబాబు చౌదరి బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వైసీపీలో చేరుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమాపై న్యాయస్థానంలో కేసు వేసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా చేసింది కూడా తానేనని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.(వావ్ షాకింగ్ ట్విస్ట్ అంటున్న రాంగోపాల్ వర్మ)