చంద్రబాబు నాయుడుతో విద్యాసాగర్ (ఫైల్)
సాక్షి, కుషాయిగూడ (హైదరాబాద్): తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనం ఇప్పిస్తానంటూ డబ్బులు కాజేసి ముఖం చాటేసిన ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్‌పై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కమలానగర్‌కు చెందిన అడ్వొకేట్ సుంకరి నరేష్‌కు తిరుమలలో ఈ నెల 7న శ్రీవారి వీఐపీ దర్శనం, వసతి కల్పిస్తానని విద్యాసాగర్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకు సంబంధించి 9550972563కు రూ. 20 వేలు గూగుల్ పేలో నరేష్ అతడికి పంపించాడు. తీరా ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దర్శనం పేరుతో తనను మోసం చేశాడంటూ అడ్వొకేట్ నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment