వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల | Enter The Girl Dragon Teaser Released | Sakshi
Sakshi News home page

వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల

Published Wed, Nov 27 2019 5:38 PM | Last Updated on Wed, Nov 27 2019 5:38 PM

Enter The Girl Dragon Teaser Released - Sakshi

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తాజా చిత్రం ‘ఎంటర్‌ ద గర్ల్‌ డ్రాగన్‌’ టీజర్‌ విడుదలైంది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఈ సినిమాను టీజర్‌ను వర్మ విడుదల చేశారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో నటించారు. వర్మ అభిమానులు మెచ్చేలా ఈ సినిమా టీజర్‌ ఉంది. పూజా భలేకర్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్టుగానే కనిపిస్తోంది.

ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రమని, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని రాంగోపాల్‌ వర్మ పేర్కొన్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్‌ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్‌ సిటీలో డిసెంబర్‌ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇండో-చైనా సంయుక్త నిర్మాణంలో జింగ్‌ లియు, టి.నరేశ్‌, టి.శ్రీధర్‌ ఈ సినిమాను నిర్మించారు. రవి శంకర్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement