‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌ | RGV Enter The Girl Dragon Movie Latest Update | Sakshi
Sakshi News home page

‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’ ఓ ట్రెండ్‌ సెట్టర్‌

Published Sat, Mar 7 2020 5:39 PM | Last Updated on Sat, Mar 7 2020 5:45 PM

RGV Enter The Girl Dragon Movie Latest Update - Sakshi

ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో బ్రూస్లీ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ చెబుతుంటారు. ఇదిలావుండగా...ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఇప్పుడు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రం కావడం విశేషం. 

మొదటి నుంచి విభిన్నచిత్రాలు చేస్తూ.. ఓ ప్రత్యేక పంథా కు తెరతీసిన వర్మ మార్షల్ ఆర్ట్స్ కు గ్లామర్ ను మేళవించి మరో కొత్త ట్రెండుకు తెర తీయబోతున్నారు. ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రధారి పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయని చిత్రబృందం వెల్లడించింది. పై పెచ్చు ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ కానుందని వారు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేషమైన ప్రేక్షక స్పందన లభించడమే కాదు ట్రెండింగ్ అయ్యింది. లోగడ చైనాలోనూ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా చిత్రనికి సంబందించిన పోస్టర్స్‌ను విడుదల చేసింంది. 


చదవండి:
రేణుక, ఆమె బిడ్డకు సాయం చేయండి: ఆర్జీవీ
కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్‌: వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement