హాట్ హాట్‌గా 'గన్స్ అండ్ థైస్'
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ వివాదం. వివాదాలతోనే సినిమాలకు ప్రమోషన్లు తెప్పించే రేంజ్‌కు ఆయన ఎప్పుడో ఎదిగిపోయారు. తాజాగా గన్స్ అండ్ థైస్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు తన ట్వీటర్ ద్వారా వెల్లడించాడు వర్మ. ఊరికే ప్రకటనతో సరిపెడితే ఆయన వర్మ ఎందుకు అవుతారు. దానికి తోడు ఓ ఆరున్నర నిమిషాలకు పైగా నిడివి గల ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.
అంతే ఒక్కసారిగా కొత్త వివాదం బయటకు వచ్చింది. కారణం గన్స్ అండ్ థైస్ ట్రైలర్‌లో మహిళలను అశ్లీలంగా చూపించడం. దీన్ని సమర్ధించుకుంటూ వర్మ చేసిన మరికొన్ని ట్వీట్లు అగ్ని ఆజ్యం పోసినట్లయింది. 'ఒక వెబ్‌సిరీస్‌లో కథను ఉన్నది ఉన్నట్లు చూపించొచ్చు. సెన్సార్‌షిప్ ఈ మీడియంలో ఉండదు.' అని వర్మ పేర్కొన్నాడు.
‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్‌లో క్రైమ్ సీన్లు జుగుప్సాకరంగా ఉన్నాయి. తన సినిమాల్లో ఇంత వరకూ సెన్సార్‌షిప్ కారణంగా చూపించలేని భయంకరమైన హింసను ఈ ట్రైలర్‌లో చూపించాడు వర్మ. గతంలో ముంబై మాఫియాకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాలని. . ఆ సన్నివేశాలను రియలిస్టిక్‌గా చిత్రీకరించాలని ప్రయత్నించినా కుదరలేదని.. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లో వాటిని ప్రజంట్ చేస్తున్నట్లు తెలిపాడు.