Guns and Thighs
-
హాట్ హాట్‌గా 'గన్స్ అండ్ థైస్'
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ వివాదం. వివాదాలతోనే సినిమాలకు ప్రమోషన్లు తెప్పించే రేంజ్‌కు ఆయన ఎప్పుడో ఎదిగిపోయారు. తాజాగా గన్స్ అండ్ థైస్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు తన ట్వీటర్ ద్వారా వెల్లడించాడు వర్మ. ఊరికే ప్రకటనతో సరిపెడితే ఆయన వర్మ ఎందుకు అవుతారు. దానికి తోడు ఓ ఆరున్నర నిమిషాలకు పైగా నిడివి గల ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. అంతే ఒక్కసారిగా కొత్త వివాదం బయటకు వచ్చింది. కారణం గన్స్ అండ్ థైస్ ట్రైలర్లో మహిళలను అశ్లీలంగా చూపించడం. దీన్ని సమర్ధించుకుంటూ వర్మ చేసిన మరికొన్ని ట్వీట్లు అగ్ని ఆజ్యం పోసినట్లయింది. 'ఒక వెబ్‌సిరీస్‌లో కథను ఉన్నది ఉన్నట్లు చూపించొచ్చు. సెన్సార్షిప్ ఈ మీడియంలో ఉండదు.' అని వర్మ పేర్కొన్నాడు. ‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్లో క్రైమ్ సీన్లు జుగుప్సాకరంగా ఉన్నాయి. తన సినిమాల్లో ఇంత వరకూ సెన్సార్షిప్ కారణంగా చూపించలేని భయంకరమైన హింసను ఈ ట్రైలర్లో చూపించాడు వర్మ. గతంలో ముంబై మాఫియాకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాలని. . ఆ సన్నివేశాలను రియలిస్టిక్‌గా చిత్రీకరించాలని ప్రయత్నించినా కుదరలేదని.. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లో వాటిని ప్రజంట్ చేస్తున్నట్లు తెలిపాడు. -
'థండరింగ్ థైస్' అంటూ శ్రీదేవిపై వర్మ కామెంట్స్!
ముంబై: అందాల తార శ్రీదేవిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. శ్రీదేవిని విపరీతంగా పొగుడుతూ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆమె భర్త బోనీ కపూర్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వర్మ ఓ పిచ్చివాడు, వికృత మనస్తత్వం కలవాడు బోనీ కపూర్ మండిపడ్డారు. అయినప్పటికీ వర్మ శ్రీదేవిని పొగడటం మానలేదు. 'థండరింగ్ థైస్' వల్లే శ్రీదేవికి ఆ పాపులారిటీ వచ్చిందంటూ వర్మ మరో బాంబు పేల్చాడు. శ్రీదేవిపై తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. తన జీవితకథ 'గన్స్ అండ్ థైస్'లో శ్రీదేవిపై రాసిన చాప్టర్‌ను పూర్తిగా చదివిన తర్వాత బోనీ కపూర్ మాట్లాడాలని హితవు పలికారు. 'నాపై విషం చిమ్మేముందు శ్రీదేవిజీపై రాసిన ఆర్టికల్‌ను పూర్తిగా చదువాలని బోనీకి సలాహా ఇస్తున్నా. భార్యగా శ్రీదేవిపై మీకున్న గౌరవం కన్నా ఎక్కువ గౌరవం అభిమానిగా ఆమెపై నాకుంది. ఈ వాస్తవం శ్రీదేవి హృదయానికి తెలుసు' అని వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. శ్రీదేవితో 'క్షణక్షణం', 'గోవిందా గోవిందా' సినిమాలు తెరకెక్కించిన వర్మ 'థండరింగ్ థైస్' వల్లే శ్రీదేవికి ఇంతటి ప్రేక్షకాభిమానం సంపాదించుకున్నారని చెప్పాడు. 'శ్రీదేవికి వచ్చిన కీర్తికి కారణం.. ఆమె నటనాసామర్థ్యమే కాదు. ఆమె 'థండరింగ్ థైస్' (తొడలు) కూడా ఇందుకు కారణం... ప్రతిభ ఒక్కటే కొలమానం అయితే స్మితా పాటిల్ శ్రీదేవి అంత పెద్ద స్టార్ ఎందుకు కాలేకపోయింది..' అని వర్మ పేర్కొన్నాడు. 'శ్రీదేవి థైస్‌ను, చిరునవ్వును, అభినయ ప్రతిభను, ఆమె సున్నితత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తాను. అంతకన్నా ఎక్కువగా బోనీ పట్ల ఆమె ప్రేమను కూడా గౌరవిస్తాను' అని వర్మ తెలిపాడు. -
రాంగోపాల్ వర్మపై మండిపడ్డ బోనీకపూర్!
ముంబై: క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అందాల తార శ్రీదేవిపై తన అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. తాజాగా విడుదలైన తన జీవిత కథలో ఏకంగా ఒక చాప్టర్ నే ఆమెకు అంకితం ఇచ్చాడు. శ్రీదేవిని 'సౌందర్య దేవత'గా అభివర్ణిస్తూ.. ఆమె పట్ల తనకు ఉన్నది స్వచ్ఛమైన అభిమానం అని చెప్పాడు. అయితే, తన జీవిత కథ 'గన్ అండ్ థైస్'లో శ్రీదేవిపై రాసిన అధ్యాయం ఆమెకు తాను రాసిన ప్రేమలేఖ లాంటిదని, ఆమె పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్స్ లాంటిందంటూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. వర్మ వ్యాఖ్యలపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాంగోపాల్ వర్మ ఒక వెర్రి మనిషి అని, అతనిది వికృత మనస్తత్వం (పర్వర్టెడ్ మైండ్‌సైట్) అని బోనీ మండిపడ్డాడు. పబ్లిసిటీ కోసమే రాము ఇలాంటి పనులు చేస్తున్నాడని బోనీ విమర్శించాడు. -
నా పుస్తకం ఊర్మిళకు అంకితం: వర్మ
హైదరాబాద్: తన ఆత్మకథ 'గన్స్ అండ్ థైస్: ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ ట్యాగ్‌లైన్' పుస్తకాన్ని పలువురికి అంకితం చేస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. అయాన్ రాండ్, బ్రూస్ లీ, ఊర్మిళా మండోద్కర్, అమితాబ్ బచ్చన్, పోర్న్ స్టార్ టోరి బ్లాక్, మరికొందరు గ్యాంగస్టర్లకు అంకితం ఇస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తాను జీవితంలో పైకి రావడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా వీరంతా తోడ్పడ్డారని తెలిపారు. రూపా పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్ లో మార్కెట్ లోకి విడుదల చేయన్నారు. పుస్తకం కవర్ పేజీని ఇటీవలే ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తో, మహిళలతో ఉన్న సంబంధాల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వర్మ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఈ పుస్తకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
గన్స్ అండ్ థైస్.. వర్మ ఆత్మకథ
హైదరాబాద్: వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప నటుడిని ఇడియట్ అనడం ఆయనకే చెల్లు. అండర్ వరల్డ్ తో తనకు సంబంధాలు ఉన్నాయని కూడా బహిరంగంగా చెప్పగలడు. అలాంటి రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఆత్మకథ రాశారు. అది కూడా మొత్తం సిద్ధమైపోయింది. పుస్తకం మాత్రం వచ్చే నెలలోనే విడుదలై మార్కెట్లను ముంచెత్తనుంది. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. పుస్తకం కవర్ పేజిని కూడా ఆయన చూపించారు. రూపా పబ్లికేషన్స్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తోందని తెలిపారు. అందులోని కొన్ని చాప్టర్లలో... తాను అమితాబ్ బచ్చన్ ను ఇడియట్ అన్న విషయం, తన సినీ జీవితంలో తనకు అండర్ వరల్డ్ తోను, మహిళలతోను ఉన్న సంబంధాల గురించి కూడా ఉంటుందంటూ ఓ టీజర్ వదిలేశారు. ఇంకేముంది.. నెటిజన్లు దీనిపై రకరకాల వ్యాఖ్యలు చేశారు, చేస్తున్నారు. అసలు వర్మ ఓ ఐదు నిమిషాలు మాట్లాడితేనే సంచలనం అనుకుంటే.. ఆయన తన జీవితంలోని అన్ని విషయాలు, విశేషాలతో కలిపి ఆత్మకథ రాశారంటే అది ఇంకెంత సంచలనం అవుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. The book's Cover design of my autobiography to be released next month by Rupa publications pic.twitter.com/0fnWgz8KT1 — Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2015 Some chapters in it..When I called Amitabh bachchan an idiot,My affair with the Underworld,Women in My Filmy Life pic.twitter.com/qWqhsZHapn — Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2015