ముంబై: అందాల తార శ్రీదేవిపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. శ్రీదేవిని విపరీతంగా పొగుడుతూ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఆమె భర్త బోనీ కపూర్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వర్మ ఓ పిచ్చివాడు, వికృత మనస్తత్వం కలవాడు బోనీ కపూర్ మండిపడ్డారు. అయినప్పటికీ వర్మ శ్రీదేవిని పొగడటం మానలేదు. 'థండరింగ్ థైస్' వల్లే శ్రీదేవికి ఆ పాపులారిటీ వచ్చిందంటూ వర్మ మరో బాంబు పేల్చాడు. శ్రీదేవిపై తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. తన జీవితకథ 'గన్స్ అండ్ థైస్'లో శ్రీదేవిపై రాసిన చాప్టర్‌ను పూర్తిగా చదివిన తర్వాత బోనీ కపూర్ మాట్లాడాలని హితవు పలికారు. 'నాపై విషం చిమ్మేముందు శ్రీదేవిజీపై రాసిన ఆర్టికల్‌ను పూర్తిగా చదువాలని బోనీకి సలాహా ఇస్తున్నా. భార్యగా శ్రీదేవిపై మీకున్న గౌరవం కన్నా ఎక్కువ గౌరవం అభిమానిగా ఆమెపై నాకుంది. ఈ వాస్తవం శ్రీదేవి హృదయానికి తెలుసు' అని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
శ్రీదేవితో 'క్షణక్షణం', 'గోవిందా గోవిందా' సినిమాలు తెరకెక్కించిన వర్మ 'థండరింగ్ థైస్' వల్లే శ్రీదేవికి ఇంతటి ప్రేక్షకాభిమానం సంపాదించుకున్నారని చెప్పాడు. 'శ్రీదేవికి వచ్చిన కీర్తికి కారణం.. ఆమె నటనాసామర్థ్యమే కాదు. ఆమె 'థండరింగ్ థైస్' (తొడలు) కూడా ఇందుకు కారణం... ప్రతిభ ఒక్కటే కొలమానం అయితే స్మితా పాటిల్ శ్రీదేవి అంత పెద్ద స్టార్ ఎందుకు కాలేకపోయింది..' అని వర్మ పేర్కొన్నాడు. 'శ్రీదేవి థైస్‌ను, చిరునవ్వును, అభినయ ప్రతిభను, ఆమె సున్నితత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నేను గౌరవిస్తాను. అంతకన్నా ఎక్కువగా బోనీ పట్ల ఆమె ప్రేమను కూడా గౌరవిస్తాను' అని వర్మ తెలిపాడు.
'థండరింగ్ థైస్' అంటూ శ్రీదేవిపై వర్మ కామెంట్స్!
Published Wed, Dec 2 2015 5:03 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
Advertisement
Advertisement