
కోట మైసమ్మకు మద్యాన్ని తీర్థంగా పోస్తున్న ఆర్జీవీ
గీసుకొండ: ఎప్పుడు వివాదాలను సృష్టించుకుంటూ మీడియా ఫోకస్ తనపై ఉండేలా చూసుకునే సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మంగళవారం తన కొత్తచిత్రం ‘కొండా’ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కోటగండి వద్ద వరంగల్–నర్సంపేట రహదారి పక్కన ఉన్న కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి తీర్థంగా మద్యం ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక్కడి అమ్మవారికి భక్తులు మద్యాన్ని తీర్థంగా పోయడం సంప్రదాయంగా వస్తోంది. అమ్మవారికి మద్యంపోయడంపై ఆర్జీవీ స్పందిస్తూ..తానెప్పుడూ వోడ్కా తాగుతానని, అమ్మవారికి విస్కీ పట్టించానని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment