సర్కార్ 3లో అమితాబ్ లుక్ | Ramgopal Varma, Amitabh Bachan Sarkar 3 first look | Sakshi
Sakshi News home page

సర్కార్ 3లో అమితాబ్ లుక్

Published Thu, Jan 5 2017 12:36 PM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

సర్కార్ 3లో అమితాబ్ లుక్ - Sakshi

సర్కార్ 3లో అమితాబ్ లుక్

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కార్ 3. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్కు సీక్వల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంగవీటి తరువాత వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సర్కార్ గెటప్లో సాసర్లో టీ తాగుతున్న అమితాబ్.. వర్మ మార్క్ కెమెరా వర్క్, లైటింగ్తో ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రస్టింగ్గా ఉంది. అమితాబ్ లుక్తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేయనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఇమేజ్ కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ సర్కార్ సీక్వల్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement