సైరాలో అమితాబ్‌ మోషన్‌ టీజర్‌ | Unveiling the first look of Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

సైరాలో అమితాబ్‌ మోషన్‌ టీజర్‌

Published Thu, Oct 11 2018 8:31 AM | Last Updated on Thu, Oct 11 2018 8:58 AM

Unveiling the first look of Amitabh Bachchan - Sakshi

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత‍్మకంగా తెరకెక్కుతున్న  ‘సైరా నరసింహారెడ్డి' లో  బాలీవుడ్‌​ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.  బిగ్‌ బీ అమితాబ్‌ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌  మోషన్‌ టీజర్‌ని (ఫస్ట్‌లుక్‌) అఫీషియల్‌గా రిలీజ్‌ చేసింది.  నరసింహారెడ్డి  గురు  గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌  పవర్‌ఫుల్‌ లుక్‌లో ఉన్న ఈ టీజర్‌  సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో భారీ తారాగణంతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా  సైరా రూపొందుతోంది.  కొణిదెల  బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు, హీరో  రామ్ చరణ్  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అమితాబ్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement