సర్కార్ 3 ఫస్ట్ లుక్ విడుదల | ramgopal varma releases sarkar 3 movie first look | Sakshi
Sakshi News home page

సర్కార్ 3 ఫస్ట్ లుక్ విడుదల

Published Mon, Oct 17 2016 6:14 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

ramgopal varma releases sarkar 3 movie first look

నల్లటి లాల్చీ, నల్లటి లుంగీ.. మెడలో రుద్రాక్షలు, నుదుట ఎర్రటి బొట్టు.. తెల్ల గెడ్డం, తెల్ల జుట్టు.. చేతిలో టీకప్పు లేదా రివాల్వర్.. ఈ పోలికలన్నీ చెప్పగానే సర్కార్ సినిమాలో సుభాష్ నాగ్రే పాత్ర వెంటనే గుర్తుకొస్తుంది. ఈ సినిమాను ఇప్పటికే రెండు భాగాలగా తీసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మూడో భాగం సర్కార్ 3ని కూడా రూపొందిస్తున్నాడు. ప్రధాన పాత్రలన్నింటినీ ఒకేసారి పరిచయం చేయాలనుకున్న వర్మ.. మొత్తం అందరి ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా విడుదల చేశారు. వేరే సమయంలో.. వేరే సందర్భంలో ఉండే కథను ఈ సినిమా ఇతివృత్తంగా తీసుకుంటున్నందున అభిషేక్ బచ్చ్, ఐశ్వర్యారాయ్‌లకు ఇందులో అవకాశం లేదని, వాళ్లు ఈ సినిమాలో కనిపించరని వర్మ తన ట్వీట్లలో చెప్పారు.



(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

సర్కార్ 3 సినిమాలో సర్కార్‌గా సుభాష్ నాగ్రే పాత్రలో మళ్లీ అమితాబ్ బచ్చనే కనిపిస్తారు. జాకీ ష్రాఫ్ కూడా అదే లుక్‌లో ఉంటారు. అయితే.. కొత్తగా ఈ భాగంలో వస్తున్నవాళ్లు మనోజ్ బాజ్‌పాయి, యామీ గౌతమ్, రోనిత్ రాయ్, అమిత్ సాద్. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆఖరు నుంచి మొదలవుతుందని అంటున్నారు. కొత్త సినిమాలో అన్ను కర్కరే పాత్రను యామీ గౌతమ్ పోషిస్తోంది. తన తండ్రిని చంపిన సర్కార్ మీద పగ తీర్చుకునే పాత్రలో ఆమె కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కాస్త హింసాత్మకంగా ఉంటే ఎలా ఉంటారో.. అలాంటి గోవింద్ దేశ్‌పాండే పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయి కనిపిస్తాడు. ఇక సర్కార్ కుడిభుజంగా.. ఆయనకు నమ్మిన బంటు గోకుల్ సతామ్ పాత్రలో రోనిత్ రాయ్ ఉంటాడు. సర్కార్ సినిమాలో జులాయి కొడుకు విష్ణు ఉంటాడు. అతడి కొడుకు శివాజీ అలియాస్ చీకు అనే పాత్రను ఈ భాగంలో పరిచయం చేస్తున్నారు. ఆ పాత్రకు అమిత్ సాద్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాడు. ఇక ప్రధాన విలన్లలో ఒకరుగా జాకీ ష్రాఫ్ ఉంటారు. కంపెనీ సినిమాలో మంత్రిగా నటించిన భరత్ ధబోల్కర్.. సర్కార్ 3లో గోరఖ్ రాంపూర్ అనే పాత్రలో కనిపిస్తారు. గాంధీ సినిమాలో కస్తూరి బా పాత్ర పోషించి.. చాలా గౌరవప్రదంగా ఉండే రోహిణీ హట్టంగడి.. సర్కార్ 3 సినిమాకు వచ్చేసరికి మాత్రం రుక్కు బాయ్ దేవి అనే విలన్ పాత్రలో కనిపిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement