Sarkar 3
-
బాలీవుడ్ రౌండప్ 2017
2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కథ బాగా ఉన్న దాదాపు పదిహేను చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. కమర్షియల్ సినిమాలు మూడు నాలుగే ఈ సంవత్సరం తల ఎత్తుకొని తిరిగాయి. యాభై ఏళ్లు పైబడిన ఒక వితంతువు తన కంటే వయసులో చిన్నవాడైన ఒక అబ్బాయితో ఫోన్లో చాటింగ్ చేస్తూ సంతృప్తి పడుతుంటుంది– ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’లో. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామనుకునేంతలో ఆ అబ్బాయి తనకు అంగ స్తంభన సమస్య ఉన్నట్టుగా తెలుసుకుని ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు ‘శుభ మంగల్ సావధాన్’ సినిమాలో. చదువు పెద్దగా లేని ఒక గృహిణి గౌరవప్రదమైన ఉద్యోగం చేసి తానేమిటో నిరూపించుకోవాలనుకుంటుంది ‘తుమ్హారి సులూ’లో విద్యాబాలన్ రూపంలో. భర్తను కోల్పోయిన ఒక యువ వయస్కురాలు ఒంటరితనం భరించలేక డేటింగ్ సైట్లో ఒక పురుషుని తోడు వెతుక్కుంటుంది ‘కరీబ్ కరీబ్ సింగిల్’ ప్రయాణంలో. దేశంలో ఎంత భ్రష్టత్వం ఉన్నా ఆ భ్రష్టత్వంతో తాను భాగం కాకుండా తన డ్యూటీ తాను కచ్చితంగా చేసుకోవడంలో ఎంతో సంతృప్తి పడతాడు ఒక కథానాయకుడు ‘న్యూటన్’లో. కాశీలో కొన ఊపిరి వదలాలని ఉందని ఒక ముసలి తండ్రి తన కుమారుణ్ణి కోరితే ఆయనతో కలిసి కాశీకి వెళ్లి తనను తాను ఏం తెలసుకున్నాడో ఆ కొడుకు అని చెప్పే కథ ‘ముక్తి భవన్’. పర్యావరణ విధ్వంసం చేసి ప్రకృతిని అంధురాలిగా చేస్తున్న మనిషి అత్యాసను ఒక అంధుడు ఎత్తి చూపే కథ ‘కడ్వీ హవా’. ముప్పై అంతస్తుల భవనంలో ఒక కుర్రవాడు తన ఫ్లాట్‌లో బందీ అయ్యి రోజుల తరబడి తిండీ తిప్పలు లేకుండా మనుగడ కోసం ఎలాంటి పోరాటం చేశాడో చెప్పే కథ ‘ట్రాప్డ్’. బిహార్‌లో బూతు పాటలు పాడుతూ వేదికల మీద అశ్లీల నృత్యాలు చేసే ఒక కళాకారిణి జీవన వేదన ‘అనార్కలీ ఆఫ్ ఆరా’ సినిమా. బాలీవుడ్ మారిపోయింది. బాలీవుడ్ చాలా మారిపోయింది అనడానికి 2017 ఒక ఉదాహరణ. పెద్ద పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్, మసాలా పాటలు, విదేశాల లొకేషన్స్... ఇవన్నీ ఒకవైపు ఉన్నా కంటెంట్‌ను నమ్ముకుని ఈ సంవత్సరం అక్కడి దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీశారు. వాటిని విజయవంతం చేసి ప్రేక్షకులు తమకు టేస్ట్ ఉందని నిరూపించుకున్నారు. నిజంగా 2017 సంవత్సరం బాలీవుడ్ భిన్నత్వాన్ని ఉలిక్కిపడేలా నిరూపించిన సంవత్సరం. కొత్త కథలు, గుర్తుండిపోయేలా చేసే పాత్ర పోషణలు. ఆలోచన రేకెత్తించే క్లయిమాక్స్‌లు ఇవన్నీ ఈ సంవత్సరంలోని సినిమాలు చూపించాయి. పెద్ద సినిమాల పై పైచేయి సాధించిన చిన్న సినిమాలు ఇవి. 2017లో బాలీవుడ్లో దాదాపు 125 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గత సంవత్సరాలతో పోల్చితే జయపజయాలు ఎలా ఉన్నా మొత్తం ఆదాయాన్ని చూస్తే 5 నుంచి 10 శాతం తగ్గినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ఈ తగ్గుదల 2 నుంచి 3 శాతమే ఉంటుంది. ఈ సంవత్సరం ముగ్గురు ఖాన్లు మరీ గొప్పగా మెరిసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. షారుక్ ఖాన్ ‘రయీస్’ పెద్ద కలెక్షన్లు రాబట్టింది కానీ సినిమాగా పెద్దగా ఎవరూ చెప్పుకోలేదు. షారూఖ్ నటించిన మరో సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సీజెల్’ విదేశాల్లో కలెక్షన్లు సాధించినా భారతదేశంలో ప్రేక్షకులను పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. అతని మరో భారీ సినిమా ‘టైగర్ జిందాహై’ సంవత్సరాంతానికి విడుదలయ్యి తన భవిష్యత్తును తేల్చుకోవాల్సి ఉంది. ‘దంగల్’ హిట్‌తో రిలాక్స్ అయిన ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో ఒక చిన్నపాత్రతో సరిపెట్టుకున్నాడు. మరి హిట్స్ ఎవరు తమ బ్యాగ్‌లో వేసుకున్నట్టు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు వరుణ్ ధావన్ రెండు మంచి హిట్స్ కొట్టాడు. ఒకటి ‘బదరీనాథ్ కి దుల్హనియా’. రెండు ‘జుడ్వా 2’. ఈ ‘జుడ్వా’ సిరీస్‌కు మూలం మన ‘హలో బ్రదర్’ సినిమా అన్నది విదితమే. అక్షయ్ కుమార్ కూడా రెండు హిట్లు కొట్టాడు. ఒకటి ‘జాలీ ఎల్ఎల్బి 2’, రెండు ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’. దేశంలో స్వచ్ఛభారత్ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక భర్త తన కొత్త పెళ్లికూతురికి ఇంట్లో టాయిలెట్ కట్టి ఇవ్వడానికి ఊరితో, వ్యవస్థతో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందో చెప్పే ఈ కథను ప్రేక్షకులు ముక్కు మూసుకోకుండా యాక్సెప్ట్ చేసి కలెక్షన్ల చప్పట్లు కొట్టారు. చాలా రోజులుగా టైమ్ బాగాలేని హృతిక్ రోషన్‌కి ఈ సంవత్సరం ‘కాబిల్’ సినిమా వచ్చి ప్రాణం లేచి వచ్చింది. అంధుడుగా నటించిన హృతిక్ తన భార్యను చంపిన విలన్స్‌పై తెలివిగా ఎలా పగ తీర్చుకున్నాడో ఈ సినిమా ఆసక్తికరంగా చెప్పడమే కారణం. ఇక ఊహించని హిట్ అంటే ‘గోల్మాల్ అగైన్’ అనే చెప్పుకోవాలి. షారుక్‌తో ‘దిల్వాలే’ తీసి కొంచెం వెనుకంజ వేసిన రోహిత్ షెట్టి తన పాత టీమ్‌తో పాత ఫార్ములాతో ‘గోల్మాల్ ఎగైన్’ తీసి ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు. తెలుగులో దుమ్ము రేపుతున్న హారర్ ఫార్ములాను మొదటిసారి అతడు ఈ సిరీస్‌లో ఉపయోగించి సక్సెస్ కొట్టాడు. ఈ హిట్ అజేయ్ దేవగన్ అకౌంట్లో పడింది. ప్యారలల్ హీరోలుగా పెద్ద హీరోలతో సమానంగా సినిమాలు ఇస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ, ఇర్ఫాన్ ఖాన్ సోలో హీరోలుగా చెరి రెండు సినిమాలు చేశారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ‘హరామ్ ఖోర్’, ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్’ చేస్తే రెండూ యావరేజ్‌గా నడిచాయి. కానీ ఇర్ఫాన్ ఖాన్ చేసిన రెండు సినిమాలు ‘హిందీ మీడియమ్’, ‘కరీబ్ కరీబ్ సింగిల్’ మంచి కలెక్షన్లు తెచ్చి హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇర్ఫాన్ కంటే నవాజుద్దీన్ ఎక్కువ రోల్స్ చేస్తున్నాడని చెప్పాలి. 2017లో స్త్రీ ప్రధాన సినిమాలు కూడా చాలా వచ్చాయి. వీటిలో తాప్సీ ‘నామ్ షబానా’, విద్యా బాలన్ ‘బేగం జాన్’, ‘తుమ్హారీ సులూ’, శ్రీదేవి ‘మామ్’, శ్రద్ధా కపూర్ ‘హసీనా పార్కర్’, కంగనా రనౌత్ ‘సిమ్రన్’లు ఉన్నాయి. వీటిలో ‘మామ్’, ‘తుమ్హారీ సులూ’ మంచి కలెక్షన్లు సంపాదించాయి. హిమాలయాలను చిన్న వయసులో అధిరోహించిన మన తెలుగమ్మాయి పూర్ణ జీవితం ఆధారంగా ‘పూర్ణ’ రాహుల్ బోస్ దర్శకత్వంలో వచ్చింది. అంచనాలు పెంచి నిరాశ పరిచిన సినిమాలు కూడా 2017లో ఉన్నాయి. విశాల్ భరద్వాజ్ ‘రంగూన్’, రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్ 3’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా చేసిన ‘రాబ్తా’, రణ్‌బీర్ కపూర్ ‘జగ్గా జాసూస్’ ముఖ్యమైనవి. సచిన్ టెండూల్కర్ బయోపిక్‌ను కూడా జనం పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఇక కాంట్రవర్సీస్ విషయానికి వస్తే ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ తమ ఆంతరంగిక వ్యవహారం వల్ల కోర్టు కేసుల దాకా వెళ్లారు. సోను నిగమ్ అజాన్ విషయంలో కామెంట్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ‘ఇందు సర్కార్’ విడుదల ఏకంగా సెన్సార్ బోర్డ్ చైర్మన్ పెహ్లాజ్ నిహలానీ సీటుకే ఎసరు తెచ్చింది. ఇందిరా గాంధీ ఎమర్జన్సీ రోజుల మీద వచ్చిన ఆ సినిమాను యధాతథంగా విడుదల చేయాలని బిజెపి ప్రభుత్వం భావిస్తే దానికి కట్స్ ఇవ్వడం వల్ల పెహ్లాజ్ ప్రభు ద్రోహిగా మారి పదవి పోగొట్టుకున్నాడని కథనం. ఏమైనా బాలీవుడ్లో ‘బాహుబలి 2’ కలెక్షన్లకు మించి వేరే పెద్ద సినిమాల న్యూస్ లేదు. ఉన్న న్యూస్ అంతా కంటెంట్ ఆధారంగా వచ్చిన చిన్న సినిమాలదే. రాబోయే సంవత్సరం పెద్ద సినిమాలు, భిన్నమైన చిన్న సినిమాలు హిందీలో మనల్ని అలరిస్తాయని భావిద్దాం. సల్మాన్ ఖాన్ తనకు కలిసొచ్చిన దర్శకుడు కబీర్‌ఖాన్‌తో భారీ ఖర్చుతో ‘ట్యూబ్‌లైట్’ తీస్తే అది స్టార్టింగ్ ప్రాబ్లమ్‌తో మినుకు మినుకుమని కొట్టుకుని మరి వెలగలేదు. స్ట్రయిట్ సినిమాలతో సమానంగా ‘బాహుబలి 2’ హిందీ డబ్బింగ్ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం ఈ సంవత్సరం చూసిన మరో విశేషం. ప్రియాంకా చోప్రా ప్రధాని మోడీ సమక్షంలో కాలి మీద కాలు వేసుకుని కూర్చుని సోషల్ మీడియాలో చర్చ లేవదీసింది. ఎంతో భారీగా నిర్మించిన ‘పద్మావతి’ విడుదల కాకపోవడం పెద్ద విషాదం. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా విడుదలైతే ఏ మార్పులతో విడుదలవుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది. -
మెగాస్టార్ రేంజ్ ఇంతేనా..?
చిన్న సినిమాలు కూడా వసూళ్ల రికార్డులు సృష్టిస్తుంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజా చిత్రంతో అభిమానులకు షాక్ ఇచ్చాడు. కొంతకాలంగా తన ఫాంతో అభిమానులను ఇండస్ట్రీ జనాలను ఇబ్బంది పెడుతున్న రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా అంగీకరించి ష్యాన్స్కు షాక్ ఇచ్చిన అమితాబ్, తాజాగా ఆ సినిమా కలెక్షన్లతో మరోసారి నిరాశపరిచాడు. బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ సీరీస్‌గా గుర్తింపు తెచ్చుకున్న సర్కార్ సీరీస్‌లో మూడో భాగంగా రిలీజ్ అయిన సర్కార్ 3, మినిమమ్ కలెక్షన్లు కూడా సాధించలేకపోతోంది. వరున ఫెయిల్యూర్స్‌తో కెరీర్ ను కష్టాల్లో పడేసుకున్న వర్మ.. అమితాబ్‌తో సినిమా చేసి కూడా తన పంథా మార్చుకోలేదు. మరోసారి రొటీన్ టేకింగ్‌తో నిరాశపరిచాడు. దీంతో సర్కార్ 3 తొలి వీకెండ్లో కేవలం 6.75 కోట్లు మాత్రమే వసూళు చేసింది. తెలుగు సినిమాలు కూడా ఇంతకన్నా ఎక్కువ వసూళ్లు సాధిస్తున్న సమయంలో మెగాస్టార్ సినిమా కలెక్షన్లు ఈ స్థాయిలో ఉండటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. -
ఒక్క మాటలో రివ్యూ చెప్పాలంటే..
బాలీవుడ్లో శుక్రవారం రెండు సినిమాలు ప్రధానంగా విడుదలయ్యాయి. వాటిలో ఒకటి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించినది కావడంతో దానిమీద ఎంత లేదన్నా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలకు ఒక్కొక్క మాటలోనే రివ్యూ చెప్పాలంటే.. అంటూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సీనియర్ పాత్రికేయుడు తరణ్ ఆదర్శ్ చెప్పేశాడు. సర్కార్ 3: డిజప్పాయింటింగ్ (నిరాశాజనకం), మేరీ ప్యారీ బిందు: బోరింగ్ అని తన రివ్యూ ఇచ్చేశాడు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో సర్కార్ సిరీస్‌లో మూడోదిగా వచ్చిన సర్కార్ 3 సినిమాకు కొందరు విమర్శకులైతే కేవలం ఒకటిన్నర స్టార్ రేటింగ్ ఇచ్చారు. అమితాబ్ లాంటి అగ్రనటుడు ఉన్నా కూడా ఆ సినిమాను పెద్దగా కాపాడలేకపోయారని చెప్పారు. #OneWordReview...#Sarkar3: Disappointing#MeriPyaariBindu: Boring — taran adarsh (@taran_adarsh) 12 May 2017 -
అమితాబ్ సినిమాకు పాట రాసిన తెలుగు రచయిత
దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు, సంగీత దర్శకులు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా? తొలిసారిగా తెలుగు సినీగీతరచయిత సిరాశ్రీ బాలీవుడ్ సినిమాకి పాట రాసారు. అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'సర్కార్-3' చిత్రానికి గాను సిరాశ్రీ 'థాంబా..' అంటూ ఒక హిందీ పాట రాశాడు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అమితాబ్ సినిమాకు పాట రాయటంపై సిరాశ్రీ స్పందిస్తూ, 'తెలుగులో పాటలు రాసుకునే నేను హిందీ సినిమాకు పాట రాస్తానని కలలో కూడా అనుకోలేదు. అది కూడా సాక్షాత్తు అమితాబ్ బచ్చన్‌కి రాస్తానని అసలు ఊహలో కూడా లేదు. ఆర్జీవి ఇక తెలుగులో సినిమాలు చెయ్యను అన్నారు. అది జరిగితే, ఇక ఆయనకు నాతో గీతరచయితగా జర్నీ ఆగిపోయినట్టే. అది జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలా నా నుంచి హిందీపాట తన్నుకొచ్చింది అని నా ఫీలింగ్. 'నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' కదా! ఏళ్ల తరబడి చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాంపుల వల్ల పట్టుబడిన కొంత హిందీ, ఆర్జీవీ సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు...ఇలా అన్ని విషయాలు నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి'. అని ఫేస్ బుక్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. -
'అమితాబ్ అబద్దాల కోరు'
-
'అమితాబ్ అబద్దాల కోరు'
తన సినిమాల ప్రమోషన్ కోసం రకరకాల స్టంట్ లు చేసే రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం సర్కార్ 3 కోసం కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికు పలు వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న వర్మ త్వరలో మెగాస్టార్‌ను ఇంటర్య్యూ చేయనున్నాడు. వర్మను ఇంటర్య్యూ చేయబోతున్న మెగాస్టార్ ఎవరో కాదు సర్కార్ 3 హీరో అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఇంతవరకు దర్శకుడు ఇంటర్వ్యూ చేయలేదు. అయితే తానే స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సర్కార్ 3 సినిమా కోసం వర్మ చేయనున్న ఇంటర్య్వూకు అంగీకరించాడు. మే 8న ఈ ఇంటర్య్యూకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమితాబ్‌తో పాటు జాకీ ష్రాఫ్, యామీ గౌతమ్, మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రల్లో నటించిన సర్కార్ 3 మే 12న రిలీజ్ అవుతోంది. -
హారతి పాట పాడిన మెగాస్టార్
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి 'సర్కారు'గా సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'సర్కార్-3'లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న 'సర్కార్' సిరీస్‌లోని రెండు సినిమాలకు ఇది సీక్వెల్. ఈ సినిమాలో ఎప్పటిలాగే అమితాబ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రోనిత్ రాయ్, జాకీ ష్రఫ్, మనోజ్ బాజ్‌పేయి, యామీ గౌతమీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం స్వయంగా అమితాబ్ బచ్చనే గణపతి హారతి పాట పాడారు. అమితాబ్ గొంతులోని గాంభీర్యం, చక్కని కెమెరా పనితనంతో కూడిన ఈ పాట వీడియో ప్రోమో.. ట్రైలర్ తాజాగా ఆన్లైన్లో విడుదలైంది. ఈ పాట చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ పాట లింక్‌ను అమితాబ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. T 2412 - The Ganesh Aarti sung by me for SARKAR 3 .. the aarti perhaps one of the most powerful and divine !https://t.co/mZFKzPI6bv pic.twitter.com/jcIPSf6eo0 — Amitabh Bachchan (@SrBachchan) 2 May 2017 -
వర్మ రాక్షసుడిగా మారక ముందు..!
సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ ట్వీట్ల తో ఎంటర్టైన్ చేసే రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికమైన ట్వీట్ చేశాడు. చాలా ఏళ్ల కిందట తన కూతుర్ని ఒళ్లో కూర్చోపెట్టుకొని దిగిన ఫోటోను ట్వీట్ చేసిన వర్మ నా గత జన్మలో అంటూ ట్వీట్ చేశాడు. తరువాత అదే ఫోటోను మరోసారి పోస్ట్ చేసి 'రాక్షసుడిగా మారకముందు, నా మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫోటో ఇది' అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం అమితాబ్ లీడ్ రోల్ తెరకెక్కుతున్న సర్కార్ 3 పనుల్లో బిజీగా ఉన్న వర్మ, మే 12న ఆ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. సర్కార్ తో ఎలాగైన సక్సెస్ సాధించాలన్న కసితో ఉన్న వర్మ షూటింగ్ అంతా పూర్తయిన తరువాత కూడా సినిమాకు రిపేర్లు చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పలువురు బాలీవుడ్ ప్రముఖులకు అమితాబ్ సన్నిహితులకు సినిమా చూపించి మార్పులు చేర్పులు చేస్తున్నాడట. మరి మారిన వర్మ తీసిన సర్కార్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. A pic from my previous birth pic.twitter.com/PHmYPqxZ5m — Ram Gopal Varma (@RGVzoomin) 26 April 2017 Raakshasudigaa maaraka mundhu,naa Manavathvam inka bathikunna Manchi roojullo naa koothuritho digina photo Idhi pic.twitter.com/Vqk5lu8uIt — Ram Gopal Varma (@RGVzoomin) 26 April 2017 -
'సర్కార్ 3' విడుదల వాయిదా
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ రామ్ గోపాల్ వర్మ.. మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తన కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌గా నిలిచిన సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలకు కొనసాగింపుగా సర్కార్ 3 సినిమాను రూపొందిస్తున్నాడు. మరోసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సర్కార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న వర్మ, గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కార్ సినిమాను తన పుట్టిన రోజున ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే అనుకున్న సమయం కన్నా ఈ సినిమాను నెల రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ముందుగా చెప్పినట్టుగా ఏప్రిల్ 7న కాకుండా మే 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్‌తో పాటు జాకీష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, యామీ గౌతమ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న మూలంగానే సినిమా రిలీజ్ వేసినట్టుగా తెలుస్తోంది. -
'సర్కార్'కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
రామ్ గోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక వివాదం ఉంటుంది. ఏది లేకపోతే వర్మ స్వయంగా వివాదాన్ని సృష్టిస్తుంటాడు. వర్మ వ్యక్తిత్వమే కాదు ఆయన సినిమాలు కూడా వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. వర్మ తాజా చిత్రం సర్కార్ 3 విషయంలోనూ అదే కొనసాగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ సీరీస్, సర్కార్. ఇప్పటికే రెండు భాగాలుగా ఘన విజయం సాధించిన ఈ సీరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రిలీజ్‌కు రెడీ అవుతోంది. త్వరలో వర్మ పుట్టిన రోజున రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా, ట్రైలర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సాధారణంగా నిజజీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ముందు డిస్క్లైమర్ను జోడిస్తుంటారు. 'ఈ సినిమాలో చూపించిన సంఘటనలు, పాత్రలు పూర్తిగా కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఒకవేళ ఎవరినైనా పోలి ఉంటే అది యాధృచ్చికమేగాని ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు' అంటూ క్లారిటీ ఇస్తారు. వర్మ తాజా చిత్రం సర్కార్ 3 ట్రైలర్‌ను సెన్సార్ చేసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ట్రైలర్‌కు కూడా డిస్క్లైమర్ను యాడ్ చేయాల్సిందిగా సూచించారు. సర్కార్ సీరీస్‌లో అమితాబ్ పోషించిన సుభాష్ నాగ్రే పాత్ర, బాల్ థాక్రేను పోలి ఉంటుంది. అందుకే తొలి రెండు చిత్రాలకు డిస్క్లైమర్ను జోడించారు. అయితే సర్కార్ 3 విషయంలో మాత్రం ట్రైలర్‌కే డిస్క్లైమర్ యాడ్ చేయాల్సి వచ్చింది. విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న సర్కార్ 3 విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తుందో చూడాలి. -
వర్మ పుట్టినరోజుకి...
సర్కార్, సర్కార్ 2.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌కి లభించిన ఆదరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వర్మ తెరకెక్కించిన ‘సర్కార్ 3’ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల కానుంది. సుభాష్ సర్కార్ నాగ్రే పాత్రలో అమితాబ్ నటించగా, మనోజ్ బాజ్ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ ఇతర పాత్రలు చేశారు. పరాగ్ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
వర్మ పుట్టిన రోజున బిగ్ బి సినిమా
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన నెక్ట్స్ సినిమా రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేశాడు. సౌత్‌లో వరుసగా చిన్న సినిమాలతో తన స్థాయిని కోల్పోయిన వర్మ, తిరిగి బాలీవుడ్ చేరాడు. మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు అమితాబ్ బచ్చన్‌తో సక్సెస్ ఫుల్ సర్కార్ సీరీస్‌లో మరో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్‌లో అమితాబ్, సర్కార్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఎనౌన్స్ చేశాడు వర్మ. ఏప్రిల్ 7న తన పుట్టిన రోజు సందర్భంగా సర్కార్ 3 రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. అమితాబ్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపే సుభాష్ నాగ్రేగా కనిపిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్‌పాయ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ తన సొంత నిర్మాణ సంస్థ ఏబీసీఎల్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. Sarkar 3 to release on April 7th..On My Birthday😌 pic.twitter.com/mjOGmiBino — Ram Gopal Varma (@RGVzoomin) 8 February 2017 -
సర్కార్ 3లో అమితాబ్ లుక్
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కార్ 3. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్‌కు సీక్వల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంగవీటి తరువాత వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సర్కార్ గెటప్‌లో సాసర్లో టీ తాగుతున్న అమితాబ్.. వర్మ మార్క్ కెమెరా వర్క్, లైటింగ్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. అమితాబ్ లుక్‌తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేయనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇమేజ్ కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ సర్కార్ సీక్వల్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. -
ఆసక్తికర విషయం వెల్లడించిన వర్మ
హైదరాబాద్: విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర విషయం వెల్లడించారు. తాను ఇంజినీరింగ్ ఫెయిల్ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పారు. అమితాబ్ బచ్చన్ ‘ఆఖరి రాస్తా’ సినిమా పైరసీ వీడియోలు కూడా అమ్మానని, ఇప్పుడు ఆయనతోనే ‘సర్కార్ 3’ తీస్తున్నానని ట్విటర్ లో పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ తో వర్మ ఇంతకుముందు సర్కార్, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్, ఆగ్, సర్కార్ రాజ్, రణ్, డిపార్ట్ మెంట్, టైమ్ మెషీన్ సినిమాలు తీశారు. కాగా, రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం ‘వంగవీటి’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కి అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న ‘శివ టు వంగవీటి’ పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్ నిర్వహించనున్నారు. After failing in engineering,I started my career by selling pirated videos of Amitabh Bachchan's Aakhri Raasta and now I am making Sarkar 3 — Ram Gopal Varma (@RGVzoomin) 9 December 2016 -
రాంగోపాల్ వర్మకు నోటీసులు
ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చిన గ్రేట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే సావాసం చేస్తుంటాడు. తన సినిమాలకు తను సృష్టించే వివాదాలతోనే పబ్లిసిటీ చేసుకునే వర్మ తాజా మరో వివాదానికి కారణమయ్యాడు. ప్రస్తుతం వర్మ.., అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో సర్కార్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఆర్జీవీ ఈ మూడో భాగంతో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అయితే వర్మకు సర్కార్ సీక్వల్ చేసే హక్కు లేదంటూ ఓ వ్యక్తి నోటీసులు పంపించాడు. ముంబైకి చెందిన నరేంద్ర హిరావత్, సర్కార్ సీరీస్‌కు సంబందించిన సకల హక్కులు తనవని, ఆ సినిమాకు సీక్వల్, రీమేక్ లాంటివి చేయాలంటే తన అనుమతి అవసరమని తెలిపాడు. రాంగోపాల్ వర్మ తనను సంప్రదించకుండానే సర్కార్ 3 షూటింగ్ మొదలుపెట్టాడని. వెంటనే వర్మ తనతో మాట్లకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసులలో తెలిపాడు. వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సర్కార్ హక్కులు మరొకరి దగ్గర ఎందుకు ఉన్నాయో..? ఈ వివాదం పై వర్మ ఎలా స్పందిస్తాడో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
సర్కార్ 3 ఫస్ట్ లుక్ విడుదల
నల్లటి లాల్చీ, నల్లటి లుంగీ.. మెడలో రుద్రాక్షలు, నుదుట ఎర్రటి బొట్టు.. తెల్ల గెడ్డం, తెల్ల జుట్టు.. చేతిలో టీకప్పు లేదా రివాల్వర్.. ఈ పోలికలన్నీ చెప్పగానే సర్కార్ సినిమాలో సుభాష్ నాగ్రే పాత్ర వెంటనే గుర్తుకొస్తుంది. ఈ సినిమాను ఇప్పటికే రెండు భాగాలగా తీసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మూడో భాగం సర్కార్ 3ని కూడా రూపొందిస్తున్నాడు. ప్రధాన పాత్రలన్నింటినీ ఒకేసారి పరిచయం చేయాలనుకున్న వర్మ.. మొత్తం అందరి ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ల ద్వారా విడుదల చేశారు. వేరే సమయంలో.. వేరే సందర్భంలో ఉండే కథను ఈ సినిమా ఇతివృత్తంగా తీసుకుంటున్నందున అభిషేక్ బచ్చ్, ఐశ్వర్యారాయ్‌లకు ఇందులో అవకాశం లేదని, వాళ్లు ఈ సినిమాలో కనిపించరని వర్మ తన ట్వీట్లలో చెప్పారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సర్కార్ 3 సినిమాలో సర్కార్‌గా సుభాష్ నాగ్రే పాత్రలో మళ్లీ అమితాబ్ బచ్చనే కనిపిస్తారు. జాకీ ష్రాఫ్ కూడా అదే లుక్‌లో ఉంటారు. అయితే.. కొత్తగా ఈ భాగంలో వస్తున్నవాళ్లు మనోజ్ బాజ్‌పాయి, యామీ గౌతమ్, రోనిత్ రాయ్, అమిత్ సాద్. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆఖరు నుంచి మొదలవుతుందని అంటున్నారు. కొత్త సినిమాలో అన్ను కర్కరే పాత్రను యామీ గౌతమ్ పోషిస్తోంది. తన తండ్రిని చంపిన సర్కార్ మీద పగ తీర్చుకునే పాత్రలో ఆమె కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ కాస్త హింసాత్మకంగా ఉంటే ఎలా ఉంటారో.. అలాంటి గోవింద్ దేశ్‌పాండే పాత్రలో మనోజ్ బాజ్‌పాయి కనిపిస్తాడు. ఇక సర్కార్ కుడిభుజంగా.. ఆయనకు నమ్మిన బంటు గోకుల్ సతామ్ పాత్రలో రోనిత్ రాయ్ ఉంటాడు. సర్కార్ సినిమాలో జులాయి కొడుకు విష్ణు ఉంటాడు. అతడి కొడుకు శివాజీ అలియాస్ చీకు అనే పాత్రను ఈ భాగంలో పరిచయం చేస్తున్నారు. ఆ పాత్రకు అమిత్ సాద్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాడు. ఇక ప్రధాన విలన్లలో ఒకరుగా జాకీ ష్రాఫ్ ఉంటారు. కంపెనీ సినిమాలో మంత్రిగా నటించిన భరత్ ధబోల్కర్.. సర్కార్ 3లో గోరఖ్ రాంపూర్ అనే పాత్రలో కనిపిస్తారు. గాంధీ సినిమాలో కస్తూరి బా పాత్ర పోషించి.. చాలా గౌరవప్రదంగా ఉండే రోహిణీ హట్టంగడి.. సర్కార్ 3 సినిమాకు వచ్చేసరికి మాత్రం రుక్కు బాయ్ దేవి అనే విలన్ పాత్రలో కనిపిస్తారు. Guess who she is? pic.twitter.com/mw2XDbFHPu — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Yami Gautam in Sarkar 3 pic.twitter.com/6XriBmURt3 — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Yami Gautam plays the role of Annu Karkare in Sarkar 3 pic.twitter.com/RCmt80Ystf — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Yami Gautam plays a character who wants to take revenge on Sarkar for killing her father pic.twitter.com/XmRBMfNhNX — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 The fairest and the loveliest in her intensest in Sarkar 3 pic.twitter.com/NcKUZWdj1X — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Manoj Bajpayee my old enemy in Sarkar 3 pic.twitter.com/CoBY8uOmPb — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Manoj Bajpayee plays Govind Deshpande in Sarkar 3 pic.twitter.com/GO7htbUHJ3 — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Loosely based on a very cranky and sleightly violent version of Kejriwal pic.twitter.com/1P1cU07WRk — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Ronit Roy in Sarkar 3 pic.twitter.com/wjnt0LSgHx — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Ronit Roy plays Gokul Satam in Sarkar 3 pic.twitter.com/V1wv4MOXfv — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Ronit Roy plays the role of the right hand man of Sarkar pic.twitter.com/WniwiOtoNv — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Amit Sadh in Sarkar 3 pic.twitter.com/JQvbaL4GRz — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Amit Sadh plays Shivaji alias Cheeku in Sarkar 3 pic.twitter.com/MiXWKCPaFx — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Amit plays a highly arrogant and volatile character in Sarkar 3 pic.twitter.com/peGuRqKOva — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 He plays the son of KK's character Vishnu in Sarkar 3 pic.twitter.com/W0xK9HueRp — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Jackie Shroff in Sarkar 3 pic.twitter.com/6uHhl7ysyN — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Jackie Shroff plays a character referred to as Sir in Sarkar 3 pic.twitter.com/DnqRREAIk7 — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Jackie plays one of the main antagonists in Sarkar 3 pic.twitter.com/2D9T2gpllc — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Bharat Dhabolkar in Sarkar 3 pic.twitter.com/xXPA04Q5oW — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Bharat Dhabolkar the minister in Company plays Gorakh Rampur in Sarkar 3 pic.twitter.com/3PPpYrFaeU — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Bharat Dabholkar plays a vicious two faced guy in Sarkar 3 pic.twitter.com/6K4pdFBGno — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Rohini Hattangadi in Sarkar 3 pic.twitter.com/izlTM6BzvB — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Gandhi's Kasturba plays an antagonist in Sarkar 3 pic.twitter.com/TjU6MSsziW — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Rohini Hattangadi plays Rukku Bai Devi in Sarkar 3 pic.twitter.com/ZFl2i3roKV — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 New actor Amitabh Bachchan in Sarkar 3 pic.twitter.com/simYfO4Um1 — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Amitabh Bachchan plays Subhash Nagre in Sarkar 3 pic.twitter.com/Ng2ojdgHhm — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016 Both Abhishek and Aishwarya are not there in Sarkar 3 as this story is set in another time and another situation pic.twitter.com/oLa7ZFR5Kl — Ram Gopal Varma (@RGVzoomin) 16 October 2016