అమితాబ్ సినిమాకు పాట రాసిన తెలుగు రచయిత | SiraSris hindi Song For Amitabhs Sarkar 3 | Sakshi
Sakshi News home page

అమితాబ్ సినిమాకు పాట రాసిన తెలుగు రచయిత

Published Fri, May 5 2017 2:29 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

అమితాబ్ సినిమాకు పాట రాసిన తెలుగు రచయిత

అమితాబ్ సినిమాకు పాట రాసిన తెలుగు రచయిత

దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు, సంగీత దర్శకులు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా? తొలిసారిగా తెలుగు సినీగీతరచయిత సిరాశ్రీ బాలీవుడ్ సినిమాకి పాట రాసారు. అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'సర్కార్-3' చిత్రానికి గాను సిరాశ్రీ 'థాంబా..' అంటూ ఒక హిందీ పాట రాశాడు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

అమితాబ్ సినిమాకు పాట రాయటంపై సిరాశ్రీ స్పందిస్తూ, 'తెలుగులో పాటలు రాసుకునే నేను హిందీ సినిమాకు పాట రాస్తానని కలలో కూడా అనుకోలేదు. అది కూడా సాక్షాత్తు అమితాబ్ బచ్చన్కి రాస్తానని అసలు ఊహలో కూడా లేదు. ఆర్జీవి ఇక తెలుగులో సినిమాలు చెయ్యను అన్నారు. అది జరిగితే, ఇక ఆయనకు నాతో గీతరచయితగా జర్నీ ఆగిపోయినట్టే. అది జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలా నా నుంచి హిందీపాట తన్నుకొచ్చింది అని నా ఫీలింగ్. 'నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' కదా! ఏళ్ల తరబడి చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాంపుల వల్ల పట్టుబడిన కొంత హిందీ, ఆర్జీవీ సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు...ఇలా అన్ని విషయాలు నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి'. అని ఫేస్ బుక్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement