ఆసక్తికర విషయం వెల్లడించిన వర్మ | I started my career by selling pirated videos of Amitabh Bachchan, says Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

ఆసక్తికర విషయం వెల్లడించిన వర్మ

Published Sun, Dec 11 2016 11:53 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

ఆసక్తికర విషయం వెల్లడించిన వర్మ

ఆసక్తికర విషయం వెల్లడించిన వర్మ

హైదరాబాద్‌: విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆసక్తికర విషయం వెల్లడించారు. తాను ఇంజినీరింగ్‌ ఫెయిల్‌ తర్వాత పైరసీ వీడియోలు అమ్మడం మొదలుపెట్టానని చెప్పారు. అమితాబ్‌ బచ్చన్‌ ‘ఆఖరి రాస్తా’  సినిమా పైరసీ వీడియోలు కూడా అమ్మానని, ఇప్పుడు ఆయనతోనే ‘సర్కార్‌ 3’ తీస్తున్నానని ట్వి​టర్‌ లో పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌ తో వర్మ ఇంతకుముందు సర్కార్‌, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్‌, ఆగ్, సర్కార్‌ రాజ్‌, రణ్‌, డిపార్ట్‌ మెంట్‌, టైమ్‌ మెషీన్‌ సినిమాలు తీశారు.

కాగా, రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం ‘వంగవీటి’  ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌కి అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ నెల 20న ‘శివ టు వంగవీటి’ పేరుతో హైదరాబాద్‌లో ఈ ఫంక్షన్‌ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement